Home » పూర్ణ పెళ్లికి ఆమె భ‌ర్త బంగారం ఎంత పెట్టారో తెలుసా..?

పూర్ణ పెళ్లికి ఆమె భ‌ర్త బంగారం ఎంత పెట్టారో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ పెళ్లి చేసుకుంది. కేవ‌లం త‌న కుటుంబ స‌భ్యుల స‌మక్షంలోనే జ‌రుపుకోవ‌డం విశేషం. ఇటీవ‌లే తన పెళ్లికి సంబంధించిన ఫొటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది పూర్ణ‌. ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి. ఆమె సీమ టపాకాయ్ సినిమాలో హీరో అల్లరి నరేష్ సరసన నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయ‌మైంది. ఇక ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన లడ్డు బాబు, అవును, అవును-2 వంటి సినిమాలు చేసి చాలా పాపులర్ అయింది. పూర్ణ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను దీపావళి రోజున అభిమానులతో షేర్ చేసుకుంది.

Also Read : గూస్ బంప్స్ తెప్పిస్తున్న “ఫోకస్” ట్రైలర్..ఆ ఒక్క డైలాగ్ తో..!!

Advertisement

సోషల్ మీడియాలో పూర్ణ పెళ్లి ఫోటోలు చూడగానే అభిమానులలో కొత్త చర్చలు మొదలయ్యాయి. పూర్ణకు ఆమె భర్త పెళ్లిలో ఏమేం కానుకలు ఇచ్చాడు, ఎంత బంగారం పెట్టాడు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్ణకు తన భర్త బహుమతిగా పెళ్లిలో దాదాపు 1700 గ్రాముల బంగారాన్ని ఇచ్చారట. బంగారమే కాకుండా ఒక లగ్జరీ హౌస్ ని పూర్ణ కోసం తీసుకొని తన పేరు మీద పెళ్లి కానుకగా ఇచ్చాడని తెలుస్తోంది. .

Advertisement

Also Read : మ‌హేశ్ బాబు కెరీర్ బెస్ట్ “ఒక్క‌డు” సినిమాను మిస్ చేసుకున్న‌ స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఎలా మిస్ అయ్యిందంటే..?

ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో షమ్నా కాసీమ్ తనకు మ్యారేజ్ అయిపోయిందంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అనివార్య కారణాలవల్ల తమ పెళ్లి దుబాయ్‌లో కొంతమంది కుటుంబ పెద్దల సమక్షంలో జరిగినట్టు వెల్లడించింది. పూర్ణ పెళ్లి ముస్లిం సంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఒంటిపై నగలతో బంగారు బుట్ట బొమ్మను మరిపించేలా పెళ్లికూతురుగా పూర్ణ గెటప్ బాగుంది. ఈ సందర్భంగా “నేను ప్రపంచంలో నేను గ్లామరస్ లేడీ కాకపోవచ్చు, మంచి పార్టనర్ ను కాకపోయినా, నువ్వు అందించిన సహకారం మరవలేనిది” అంటూ తన భర్త పై ప్రేమను పంచుకుంది. కొన్ని అనివార్య కారణాలవల్ల కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాం. త్వరలోనే సెలబ్రిటీలకు, స్నేహితులకు కేరళలో గ్రాండ్ గా పార్టీ ఇస్తానని చెప్పుకొచ్చింది పూర్ణ‌.

Also Read : చిరంజీవి “వాల్తేరు వీరయ్య” సినిమా కథ లీక్…! సినిమాలో అదే హైలెట్ అంట….?

 

Visitors Are Also Reading