Home » చిరంజీవి “వాల్తేరు వీరయ్య” సినిమా కథ లీక్…! సినిమాలో అదే హైలెట్ అంట….?

చిరంజీవి “వాల్తేరు వీరయ్య” సినిమా కథ లీక్…! సినిమాలో అదే హైలెట్ అంట….?

by AJAY
Ad

ఆచార్య సినిమా ఫ్లాప్ తో డీలా పడిపోయిన చిరంజీవి లో గాడ్ ఫాదర్ సినిమా విజయం కొత్త జోష్ ను నింపింది. దాంతో రాబోయే సినిమాలపై మెగాస్టార్ దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమాలలో వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా సినిమాలో శృతిహాసన్ ,కేథరిన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

Advertisement

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక మెగాస్టార్ సినిమాలలో ఈ సినిమా పైనే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుండి చిరంజీవి లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వాల్తేరు వీరయ్య లో చిరంజీవి లుక్ చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ లో మెగాస్టార్ కనిపిస్తున్నారు.

Advertisement

అయితే భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రవితేజ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం గా… సినిమా కథలో చిరంజీవి రవితేజ అన్నదమ్ములుగా కనిపించబోతున్నారట. అంతేకాకుండా రవితేజ చిరంజీవి లకు తండ్రి ఒక్కరే కాగా తల్లులు మాత్రం ఇద్దరట.

ఇక సవితి తల్లులకు పుట్టిన చిరంజీవి రవితేజ మధ్య గొడవలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సినిమా క్లైమాక్స్ లో వీరిద్దరి మధ్య ఓ భారీ ఫైట్ ఉండబోతుందని కూడా సమాచారం. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో కనిపిస్తున్న కథనాల ప్రకారంగా మాత్రమే. సినిమా అసలు కథ ఏంటి అన్నది తెలియాలంటే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాను చూడాల్సిందే.

Visitors Are Also Reading