Home » పేరుకే తమిళియన్.. కానీ శివాజీ గణేశన్ తెలుగులో అన్ని సినిమాల్లో నటించాడా..?

పేరుకే తమిళియన్.. కానీ శివాజీ గణేశన్ తెలుగులో అన్ని సినిమాల్లో నటించాడా..?

by Anji
Ad

భారతదేశంలోని వివిధ సినీ పరిశ్రమలకు చెందిన కథానాయకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, వేరే చిత్ర పరిశ్రమల్లో సినిమాలో చేయడం ఎక్కువగా జరుగుతోంది. క్రాస్ పొలినేషన్ అని పేర్కొంటున్నారు కొందరూ సినీ విశ్లేషకులు. బాహుబలి సినిమాతోనే ఈ పద్దతి ప్రారంభం అయిందని చాలా మంది బాహుబలి చిత్రంతో మొదలైందని చాలా మంది భావిస్తున్నారు. కానీ పద్దతి అంతకుముందే ప్రాచుర్యంలో ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ క్రాస్ పొలినేషన్ పద్దతి బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఉందని చెప్పేందుకు నడిగర్ తిలగం శివాజీ గణేశన్ ఓ ఉదాహరణ అని చెప్పవచ్చు. తమిళ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని కథానాయకుడు అయినప్పటికీ తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. కొన్ని అతిథి పాత్రల్లో.. మరికొన్ని ముఖ్యమైన పాత్రల్లో నటించారు.  ఆయన నటించిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

పరదేశి : 

ఈ సినిమా ద్విభాషా చిత్రం. ఈ సినిమా 1953లో విడుదల అయింది. తెలుగులో ఈ సినిమా పరదేశి అయితే.. తమిళంలో మాత్రం పూంగుతై గా రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో శివాజీ గణేశన్, ఏఎన్ఆర్, ఎస్ వీఆర్, అంజలిదేవి వంటి తదితర తారాగాణం కలిసి నటించారు. 

పెంపుడు కొడుకు : 

 

ఈ సినిమా కూడా 1953లోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ఎస్వీఆర్, మహానటి సావిత్రిలతో కలిసి నటించారు శివాజీ గణేశన్. ఈ సినిమాకి ఎల్.వీ.ప్రసాద్ దర్శకత్వం వహించారు. 

బొమ్మలపెళ్లి :

Advertisement

ఈ సినిమాలో శివాజీ గణేశన్, జమున కీలక పాత్రల్లో నటించారు. ఆర్.ఎం.కృష్ణస్వామి ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా 1958 జనవరిలో తెలుగులో విడుదల కాగా.. తమిళంలో బొమ్మె కళ్యాణం అనే పేరుతో అదే ఏడాది మే లో విడుదలైంది.

 పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం :

పేరుకు తగినట్టుగానే ఈ సినిమాలో ప్రధాన పాత్రదారులు అందరూ పిల్లు కావడం విశేషం. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ వంటి భాషల్లో 1960లో విడుదలైంది. ఇందులో శివాజీ గణేశన్ ఓ స్పెషల్ రోల్ లో కనిపించారు. 

భక్త తుకారాం :

ఈ చిత్రంలో కీలక పాత్ర భక్త తుకారాం అనే పాత్రను అక్కినేని నాగేశ్వరరావు పోషించారు. శివాజీ గణేశన్ శివాజీ పాత్రలో స్పెషల్ రోల్ లో నటించారు. ఈ మూవీ 1973లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

చాణిక్య చంద్రగుప్త :

ఈ మూవీలో చాణిక్యునిగా నాగేశ్వరరావు, చంద్రగుప్తునిగా రామారావు నటించారు. ఇందులో అలెగ్జాండర్ పాత్రలో శివాజీ గణేశన్ కాసేపు మెరిసారు. ఈ సినిమా 1977లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  కేవలం ఇవి మాత్రమే కాదు.. మనోహర, నివురుగప్పిన నిప్పు, విశ్వనాథ నాయకుడు, అగ్నిపుత్రుడు, బెజవాడ బెబ్బులి, బంగారుబాబు, రామదాసు, జీవనరాగాలు వంటి సినిమాల్లో శివాజీ గణేశన్ నేరుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సెట్స్ లో సిల్క్ స్మితను అందరి ముందే చెంప పై లాగి కొట్టిన చిరంజీవి.. అసలు ఏం జరిగిందంటే ?

అరుంధతి సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ?

Visitors Are Also Reading