భారతదేశంలో గుళ్ళు,గోపురాలు, సంప్రదాయం అనేవి పూర్వ కాలం నుంచి వస్తున్న తంతు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా దేవాలయంలోకి మనం వెళ్ళినప్పుడు ముందుగా మనం ఆలయానికి ప్రవేశించే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. తర్వాత గుళ్ళోకి వెళ్తాము. ఇవి చేసేటప్పుడు చాలామందికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అవగాహన అనేది ఉండదు. వారికి తెలిసిన రీతిలో 3,5, 7, 9 ఈ విధంగా ప్రదక్షిణ చేస్తారు.
Advertisement
మరికొందరు కోరికలు కోరుకొని అవి నెరవేరాలని 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మరి ఏ గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఎలా చేయాలో మనం చూద్దాం..! సూర్యభగవానుని, మరియు నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి 27 ప్రదక్షిణ చేయడం వల్ల మంచి జరుగుతుందట. సోమవారం శివుడికి 18 ప్రదక్షిణలు, అలాగే మహాలక్ష్మీ అమ్మవారికి 20 ప్రదక్షిణలు చేయడం వలన మనకు అనేక లాభాలు ఉంటాయి.
Advertisement
అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి. గురువారం సాయిబాబా ఆలయంలో 16 ప్రదక్షిణలు చేయాలి. శుక్రవారం దుర్గమ్మ తల్లి ఆలయం లో 20 ప్రదక్షిణలు చేయాలట.
శనివారం రోజున వెంకటేశ్వరునికి 21 ప్రదక్షణలు, శని దేవునికి 18 చేయాలట.. ఈ విధంగా ఇష్టమైన రోజున మీ ఇష్ట దైవం అయిన దేవుడికి ప్రదక్షిణలు చేసి దేవాలయం లోకి ప్రవేశిస్తే మీరు కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు.
ఇవి కూడా చూడండి :
దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?
TSPSC.. గ్రూప్-1 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. పేపర్ 2 సిలబస్ ఏంటో చూడండి..!!
దటీజ్ సూపర్ స్టార్..! చిరంజీవికి అలా లైఫ్ ని ఇచ్చిన కృష్ణ ఆ సినిమా చేస్తున్నాడని తెలిసి..!