నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ రీసెంట్ మూవీ వీరసింహారెడ్డి సూపర్ హిట్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రానికి గోపించద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దర్శకుడు గోపిచంద్ మలినేని పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సంతోషం వ్యక్త పరుస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
Advertisement
అదేవిధంగా రెమ్యూనరేషన్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా దర్శకుడు గోపిచంద్ మలినేని ఇప్పటివరకు తీసిన సినిమాలకు పూర్తి రెమ్యూనరేషన్ ఎప్పుడూ రాలేదని తానే స్వయంగా వెల్లడించడ విశేషం. కేవలం ఒక్క వీరసింహారెడ్డి సినిమాకు మాత్రమే తాను పూర్తి రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలిపారు. రవితేజ హీరోగా నటించిన డాన్ శీను చిత్రంతో గోపించంద్ మలినేని దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక ఆ సినిమా తరువాత బాడీగార్డ్, బలుపు, పండుగ చేస్కో, విన్నర్, క్రాక్ వంటి సినిమాలు తెరకెక్కించారు. విన్నర్ తప్ప మిగతా సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమాల్లో ఒక్క సినిమాకి కూడా పూర్తి స్థాయి రెమ్యూనరేషన్ రాలేదని వెల్లడించారు. రవితేజతో కలిసి తీసిన క్రాక్ సినిమా విడుదలై హిట్ అయిన తరువాత తనకు రెమ్యూనరేషన్ అందిందని చెప్పుకొచ్చారు. ఆ సినిమా విషయంలో చాలా గొడవలు కూడా జరిగినట్టు వెల్లడించారు.
Advertisement
Also Read : ప్రేమిస్తే హీరో భరత్ లవ్ స్టొరీ గురించి మీకు తెలుసా ?
ఇక వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య రోల్ మామూలుగా లేదని అభిమానులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పలు థియేటర్లలో అభిమానులు జై బాలయ్య అంటూ రచ్చ రచ్చ చేసారు. ఈ చిత్రంలో బాలయ్య యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా పండించారు. ఈ సినిమాలో శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్స్ గా నటించారు. మరో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ నటుడు విజయ్ దునియా నటించారు. ఇక చిత్రంలో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ రెమ్యూనరేషన్ భారీగానే తీసుకున్నట్టు తెలుస్తోంది. హీరో బాలయ్య కంటే కూడా ఎక్కువగా వరలక్ష్మీ శరత్ కుమార్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Also Read : ఒకప్పటి టాప్ హీరోయిన్ మాలశ్రీ ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..!