టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు అవుతోంది. 2009లో వచ్చిన జోష్ సినిమా అక్కినేని నాగార్జున నట వారసుడిగా పరిచయమైన నాగచైతన్య తన కెరీర్‌లో ఎన్నో హిట్లు, పట్లున్నాయి. ఇటీవల థాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలుకరించిన చైతూ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ లాల్ సింగ్ చడ్డా చిత్రంలో చడ్డీ బడ్డీ బాలాగా ఆకట్టుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు నాగచైతన్య తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందిన నాగచైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ. 5 నుంచి 10 కోట్లు అందుకున్నట్టు సమాచారం. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య రెమ్యునరేషన్, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సినీ కెరీర్ గురించి ఆసక్తికరమై విషయాలను వెల్లడించాడు. అమీర్‌ఖాన్ లాల్‌సింగ్ చడ్డాలో బాలా పాత్రకు చైతూ సుమారు రూ.5కోట్లు తీసుకున్నాడట. అదేవిధంగా ఈ చిత్రంలో నాగచైతన్య నటన ఆకట్టుకుంటే అతనికి ఎంతో లాభదాయకంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Advertisement
Advertisement
ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్యకు భారీ అవకాశాలు వచ్చే సూచనలున్నట్టు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్నది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని.. దీంతో అతని మార్కెట్ పెరుగనున్నట్టు వివరించాడు. ఇదిలా ఉండగా.. చైతన్య ఇప్పటికే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాష చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. అదేవిధంగా డీజే టిల్లు సినిమాతో సత్తా చాటిన విమల్ కృష్ణతో కూడా చైతూ సినిమా చేయనున్నట్టు సమాచారం.
Also Read :
వయసు 60..అందంలో మన్మథుడు…నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట…!
సీత పేరులో ఉన్న మ్యాజిక్ ఏంటి…? ఆ పేరుతో వచ్చిన ఈ సినిమాలన్నీ సూపర్ హిట్…!