Home » సీత పేరులో ఉన్న మ్యాజిక్ ఏంటి…? ఆ పేరుతో వచ్చిన ఈ సినిమాలన్నీ సూపర్ హిట్…!

సీత పేరులో ఉన్న మ్యాజిక్ ఏంటి…? ఆ పేరుతో వచ్చిన ఈ సినిమాలన్నీ సూపర్ హిట్…!

by AJAY
Published: Last Updated on

ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ప్రేమ కావ్యానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమాలో హీరో పేరు రామా కాగా హీరోయిన్ పేరు సీత… నిజానికి హీరోయిన్ పేరు మరొకటి అయినా తన పేరును సీతగా మార్చుకుంటుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ చిత్రంపై రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఉన్న ఒక కామన్ పాయింట్ తో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయని మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read:  హీరోల‌కు మెగాస్టార్ సూప‌ర్ స్టార్ లాంటి బిరుదులు ఎలా వ‌చ్చాయి..? వాటి వెన‌క ఉన్న క‌థేంటి..?

అదే సినిమాలో సీత పేరులో ఉండే మ్యాజిక్. సీత పేరుతో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని సీతారామం కూడా ఆ లిస్టులో చేరిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ హీరోయిన్ గా నటించిన అంజలి పేరు సీత. ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Also Read:   నంద‌మూరి మెగాఫ్యామిలీ మ‌ధ్య 35ఏళ్లుగా వార్…అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన ఎన్టీఆర్..!

అంతే కాకుండా గోదావరి సినిమాలో హీరోయిన్ పేరు కూడా సీతనే…. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. మరోవైపు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ పేరు కూడా సీత కావడం విశేషం.

ఈ చిత్రాలతో పాటు నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాటి పేరు కూడా సీతనే. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇలా హీరోయిన్ పేరు సీత ఉన్న చాలా సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనమిస్తున్నాయి.

Also Read:  చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమాకు నో చెప్పిన సౌంద‌ర్య‌.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading