ఏ సీజన్‌లో ఏది లభిస్తే అది తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా పల్లెల్లో ఇలాంటివి ఏవి పట్టించుకోరు. వారు అనుకోకుండానే అన్నింటిని సీజన్‌లలో దొరికేవి తింటుంటారు. ఈసీజన్‌లో లభించే ఆకుకూరలు, గునుగు, శంచల తదితర ఆకుకూరలతో పాటు నల్లేరు, చింత చిగురు వంటివి తింటుంటారు. ఇక పట్టణాల వారు డబ్బులు పెట్టి కొనాలి కాబట్టి వారు అంతగా పట్టించుకోరు. కొందరూ మాత్రమే వాటిని తింటుంటారు. వాటిలో చింతచిగురుకి ఇప్పుడు మార్కెట్‌లో డిమాండ్ బాగా ఉంది. ప్రస్తుతం కేజీ చింత చిగురుకి రూ.500 ధర పలుకుతుందంట అంటే ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Advertisement
పల్లెల్లో అయితే చింత చిగురును ఇప్పటికీ చేపలు, రొయ్యలు, మటన్ వంటి మాంసాహార వంటకాల్లో కాంబినేషన్ చేసి వండుతారు. ఇక చింతచిగురుతో చెట్ని, పులిహోర, రసంలను కూడా తయారు చేస్తారు. ప్రస్తుతం పల్లెల్లో కూడా కొంత మందే దీనిని వినియోగిస్తున్నారు. చాలా వరకు పూర్వకాలంలో ఉన్న చెట్లను నరికివేయడం వల్ల అది కూడా కాస్త కరువుగానే మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తరువాత చింతచిగురులో ఉన్న పోషక విలువలు, ఔషద గుణాల గురించి విరివిగా ప్రచారం జరుగుతుండడంత పల్లెల కంటే కూడా పట్టణాలు, నగరాల్లో దీని వినియోగం బాగానే పెరిగింది. ముఖ్యంగా జూన్, జులై మాసాల్లోనే ఇది లభిస్తుంది. ఆ తరువాత చిగురు కాస్త ఆకుగా మారడంతో అంతగా రుచికరంగా ఉండదు.
Advertisement
చింత చిగురులో ఎక్కువగా ప్రోటీన్లు, తక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ మోతాదులో ఔషద గుణాలుంటాయి. ప్రతి వంద గ్రాముల చింత చిగురులో 5.8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. 10.6 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లి గ్రాముల కాల్షియం, 140 మిల్లిగ్రాముల పాస్పరస్, 26 మిల్లిగ్రాముల మెగ్నిషియం,విటమిన్ సి 3 మిల్లిగ్రాములు ఉంటుది. యాంటి బాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండడంతో మధుమేహులకు కూడా మేలు చేస్తుంది. కాలేయాన్ని రక్షించడంతో పాటు. జీర్ణక్రియను, వ్యాధి నిరోధక శక్తినిపెంచుతుంది. ఇన్ని సుగుణాలు ఉన్న చింతచిగురును ఈ సీజన్‌లో ఈనెలలో వండుకొని తిని మీరు ఆరోగ్యంగా ఉండండి.
Also Read :
ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ ను గమనించారా…? ఇలా అయితే ఎలా జక్కన్న అంటూ ట్రోల్స్..!
భర్త మరణం తరువాత మీన షాకింగ్ కామెంట్స్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!