Home » ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా…? ఇలా అయితే ఎలా జ‌క్క‌న్న అంటూ ట్రోల్స్..!

ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా…? ఇలా అయితే ఎలా జ‌క్క‌న్న అంటూ ట్రోల్స్..!

by AJAY
Ad

ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా రీసెంట్ గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ సినిమా ఆ అంచ‌నాల‌ను దాటేసింది. కేవ‌లం ఇండియాలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాకు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో జ‌క్క‌న్న క్రేజ్ ఖండాలు దాటిపోయింది.

rrr-movie-review

Advertisement

విదేశాల‌కు చెందిన వారు సైతం ఒక భార‌తీయ సినిమా చూసి ట్వీట్స్ చేశారా అంటూ అది ఆర్ఆర్ఆర్ కే ద‌క్కింద‌ని చెప్పాలి. ఈ సినిమాకు క‌లెక్ష‌న్స్ కూడా ఒక రేంజ్ వ‌చ్చాయి. బాహుబ‌లి త‌ర‌వాత జ‌క్క‌న్న మ‌ళ్లీ అంత‌టి విజ‌యాన్ని ఆర్ఆర్ఆర్ తో అందుకున్నారు. ప్ర‌స్తుతం ఇండియాలోనే తిరుగులేని ద‌ర్శ‌కుడిగా మారిపోయారు. అప్పుడప్పుడు జ‌క్క‌న్న కొన్ని సీన్ల‌ను హాలీవుడ్ సినిమాల నుండి లేపేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తుంటాయి. కానీ అవేవీ జక్క‌న్న‌ను అడ్డుకోలేదు.

Advertisement

మ‌రోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్న ఆంధ్రా, తెలంగాణ‌లోని ఇద్ద‌రు వీరులు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమురం భీం ల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ కొమురం భీం పై సినిమాలు రాలేదు. దాంతో ఆ ఘ‌న‌త కూడా రాజ‌మౌళికే ద‌క్కింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా థియేట‌ర్ లో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అయిన త‌ర‌వాత ఓటీటీలో కూడా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఓటీటీలోనూ ఈ సినిమాకు భారీగానే రెస్పాన్స్ వ‌స్తోంది. అయితే ఓటీటీలో ప్రేక్ష‌కులు ఒక్క‌సారి కాకుండా సినిమాను ఇష్టం ఉన్న‌న్ని సార్లు చూసుకునే ఆప్ష‌న్ ఉంది.

ఇలా చూస్తున్న క్ర‌మంలో సినిమాలోని మిస్టేక్ ల‌ను గ‌మ‌నించి ట్రోల్ చేస్తున్నారు. తాజాగా సినిమాలోని ఓ బ్లండ‌ర్ మిస్టేక్ ను నెటిజ‌న్లు గ‌మ‌నించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో క్లైమాక్స్ సీన్ లో రామ్ చ‌ర‌ణ్ బాణాలు విసురుతూ చేసే ఫైట్ అదుర్స్. అయితే ఈ ఫైట్ సీన్ లో చ‌ర‌ణ్ వీపుకు బాణాల‌ను త‌గిలించుకుంటాడు. అయితే ఒక సీన్ లో బాణాలు క‌నిపిస్తుండ‌గా మ‌రో సీన్ లో మాత్రం అవిక‌నిపించ‌డం లేదు. దాంతో జ‌క్క‌న్న ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశారంటూ ట్రోల్ చేస్తున్నారు.

Visitors Are Also Reading