మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ఈయన అసలు పేరు మొహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ అలియాస్ మమ్ముక్క. అతను సినీ ఇండస్ట్రీకి వచ్చిన తరువాత తన పేరును మమ్ముట్టిగా మార్చుకున్నాడు. దాదాపు 70 సంవత్సరాలకు పైగా వయస్సులో కూడా సూపర్ స్టార్ గా సౌత్ ఇండియాలో చక్రం తిప్పడమంటే అది మామూలు విషయం కాదు. మలయాళం ఇండస్ట్రీకి చెందినప్పటికీ తెలుగులో సైతం ఎన్నో చిత్రాల్లో నేరుగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడయ్యాడు.
తెలుగులో నటించిన సినిమాల గురించి చూస్తే యాత్ర, స్వాతికిరణం వంటి సినిమాలున్నాయి. సౌత్ లోనే కాకుండా హిందీలో కూడా ఆయన నటించి సత్తా చాటారు. ప్రస్తుతం మమ్ముట్టి హీరో పాత్రలు చేయాలని బార్డర్ పెట్టుకోకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ మూడున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మమ్ముట్టి వ్యక్తిగత విషయానికొస్తే.. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరు స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఖాన్ కాగా.. కుమార్తె సురుమి ఉన్నారు. మమ్ముట్టికి ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లున్నారు. మమ్ముట్టి పెద్దవాడు కావడంతో చిన్నప్పటి నుంచి ఇంటి బాధ్యత తీసుకొని అందరినీ సెటిల్ చేశారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : హరీష్ శంకర్ కు పోటీ వచ్చిన ఇంద్రగంటి..!
మమ్ముట్టి కుటుంబంలో అతడు మాత్రమే కాకుండా చాలా మంది నటులు కూడా ఇండస్ట్రీకి వచ్చారు. మొదటగా మమ్ముట్టి తమ్ముడు ఇక్బాల్ కుట్టి సైతం ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఆ తరువాత టెలివిజన్ ఇండస్ట్రీలో మాత్రమే ఆయన మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ 2012లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తండ్రిని మించిన తనయుడిగా సెటిల్ అవుతున్నాడు. తెలుగులో ఇటీవల నటించిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మమ్ముట్టి తమ్ముడు ఇక్బాల్ కుట్టి కొడుకు అయిన మఖ్బూల్ సల్మాన్ సైతం మలయాళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మమ్ముట్టి చెల్లెలు సమీనా కొడుకు అస్కార్ సౌధాన్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మరికొంత మంది వీరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలో నటులుగా పరిచయమయ్యారు.
ఇది కూడా చదవండి : మెగాస్టార్ నుంచి అల్లుఅర్జున్ వరకు వారికి ఇష్టమైన ఆహారపదార్థాలు ఇవే..!