Home » హరీష్ శంకర్ కు పోటీ వచ్చిన ఇంద్రగంటి..!

హరీష్ శంకర్ కు పోటీ వచ్చిన ఇంద్రగంటి..!

by Azhar
Ad

టాలీవుడ్ లో హరీష్ శంకర్ టాప్ డైరెక్టర్ అనే విషయం తెలిసిందే. కానీ ఆయన నుండి సినిమా రాక చాలా రోజులు అవుతుంది. కానీ ఆయన ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నాడు అనే వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే లైగర్ సినిమా ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేయాలనీ ఫిక్స్ ఐన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ కోసం కథను సిద్ధం చేయాలనీ ఆయన చాలా మంది దర్శకులకు చెప్పారు. అందులో హరీష్ శంకర్ ఓ స్టోరీ లైన్ అనేది చెప్పగా.. దిల్ రాజుకు అది బాగా నచ్చింది అని.. కథను సిద్ధం చేయాలనీ హరీష్ శంకర్ కు దిల్ రాజు చెప్పినట్లు తెలిసింది.

Advertisement

కానీ ఇప్పుడు తాజాగా హరీష్ శంకర్ కు పోటీగా మరో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ వచ్చినట్లు తెలుస్తుంది. నానితో వి సినిమా తీసిన తర్వాత ఇప్పుడు సుధీర్ బాబుతో మరో సినిమా చేస్తున్న ఇంద్రగంటి కూడా విజయ్ దేవరకొండ కోసం ఓ స్టోరీ లైన్ ను దిల్ రాజుకు చెప్పగా.. అది కూడా ఆయనకు బాగా నచ్చినట్లు తెలుస్తుంది. దాంతో ఇంద్రగంటిని కూడా దిల్ రాజు కథను సిద్ధం చేయాల్సిందిగా సూచించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

ఊర్వశి పై నసీమ్ షా షాకింగ్ కామెంట్స్..!

భారత్ మార్పుల వల్లే ఓడిపోయింది..!

Visitors Are Also Reading