Home » క‌రాచీ బేక‌రీకి ఆ పేరు ఎలా వ‌చ్చిందో మీకు తెలుసా..?

క‌రాచీ బేక‌రీకి ఆ పేరు ఎలా వ‌చ్చిందో మీకు తెలుసా..?

by Anji
Ad

పాకిస్తాన్‌లో ప్ర‌ధాన న‌గ‌రం క‌రాచీ. అయితే అదే పేరుతో మ‌న హైద‌రాబాద్‌తో పాటు అనేక న‌గ‌రాల్లో ప్ర‌సిద్ధి చెందిన క‌రాచీ బేక‌రీకి ఆ పేరు ఎలా వ‌చ్చింది ఏమిటి ఆ బేక‌రీ హిస్ట‌రి ఏమిటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

మ‌న‌లో చాలా మందికి క‌రాచీ బేక‌రీ గురించి తెలిసే ఉంటుంది. అయితే అది కేవ‌లం పేరు మాత్ర‌మే కాదు.. దాని వెనుక ఎంతో పెద్ద చ‌రిత్ర గొడ‌వలు కూడా ఉన్నాయి. 1947లో భార‌త విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు క‌రాచీ ప్రాంతం నుంచి హైద‌రాబాద్‌కు వ‌ల‌స వ‌చ్చిన సిందీ వ‌ల‌స దారుడు కాంచ‌ద్ రాంనాని ఈ బేక‌రీనీ స్థాపించాడు. రాంనాని క‌రాచీ నుంచి వ‌ల‌స రావ‌డంతో క‌రాచీ పేరు మీద‌నే బేక‌రీని స్థాపించారు. 1953లో మొహంజాహి మార్కెట్‌లో హైద‌రాబాద్‌లో మొద‌టి క‌రాచీ బేక‌రీ ప్రారంభం అయింది.

Advertisement

2019 పుల్వామా దాడితో పాకిస్తాన్ మీద పెరిగిన వ్య‌తిరేక‌త సెగ‌లు క‌రాచీ బేకరీకి కూడా త‌గిలాయి. క‌రాచీ బేక‌రీ పేరు పాకిస్తాన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రం పేరు ఒక‌టే ఉండ‌డంతో దాని పేరు భార‌తీయ క‌రాచీ బేక‌రీగా మార్చాల‌ని నినాదాలు పుట్టుకొచ్చాయి. వాటిని చ‌ల్లార్చ‌డానికి బేక‌రీల ముందు జాతీయ జెండాను ఎగుర‌వేసి దేశ‌భ‌క్తి చాటుకున్నారు బేక‌రీ యాజ‌మాన్యం. క‌రాచీ అనే పేరు త‌మ బేక‌రీకి వార‌సత్వంగా వ‌చ్చింద‌ని.. అది పాకిస్తాన్ కి సానుభూతి కాద‌ని, విభ‌జ‌న స‌మ‌యంలో పాకిస్తాన్‌లో చెల‌రేగిన హింస వ‌ల్ల తాము ఇక్క‌డికి వ‌చ్చి ఈ వ్యాపారం ఏర్పాటు చేసుకున్నామ‌ని.. ఆ పేరు పెట్ట‌డం భార‌త్‌కు వ్య‌తిరేకం కాద‌ని చెప్పారు. పేరు మార్చే ఉద్దేశం లేద‌ని యాజ‌మాన్యం వెల్ల‌డించింది. కేవ‌లం ఒక్క హైద‌రాబాద్ న‌గ‌రంలోనే 23 బ్రాంచ్‌లు ఉన్నాయి. దీంతో పాటు దేశంలో మ‌రొక 10 చోట్ల క‌రాచీ బేక‌రీ ప్ర‌సిద్ధి చెందుతుంది.

Also Read : 

HAPPY BIRTH DAY BALAYYA: గూస్ బంప్స్ తెప్పిస్తున్న “NBK 107” టీజర్.. మీరు ఓ లుక్కేయండి..?

 

Visitors Are Also Reading