Home » HAPPY BIRTH DAY BALAYYA: గూస్ బంప్స్ తెప్పిస్తున్న “NBK 107” టీజర్.. మీరు ఓ లుక్కేయండి..?

HAPPY BIRTH DAY BALAYYA: గూస్ బంప్స్ తెప్పిస్తున్న “NBK 107” టీజర్.. మీరు ఓ లుక్కేయండి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలోని మాస్ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టాడు. ఇప్పటికి కూడా ఆయన సినిమాలు థియేటర్లకు వచ్చాయంటే కేకలు, అరుపులతో దద్దరిల్లిపోతోంది. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ nbk 107 లో కొత్త లుక్ లో కనిపించనున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాNBK 107 హంట్ టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం.

Advertisement

రఫ్ ఆడించే డైలాగ్స్ తో అదరగొడుతున్నారు నటసింహ. నేను నరకడం మొదలు పెడితే అంటూ డైలాగ్ తో మరో మాస్ యాక్షన్ సీన్ తో అదరగొడుతున్నారు బాలయ్య. కత్తి పట్టుకుని బరిలోకి దిగిన తర్వాత రక్తం ఏరులై పారాల్సిందే. అనే డైలాగ్ తో కేక పుట్టిస్తున్నాయి. అఖండ లాంటి హై ఓల్టేజ్ యాక్షన్ తర్వాత దాన్ని మరవాలి అంటే ఈ మూవీలో ఈ మాత్రం మాస్ ఉండకపోతే ఎలా అంటున్నారు గోపీచంద్ మలినేని.

Advertisement

జూన్ 10 బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఎన్ బీకే 105 టీజర్ ను విడుదల చేశారు. కానీ టైటిల్ విషయంలో మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఈ మూవీని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ఫుల్ మాస్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నారు బాలయ్య. ఈ చిత్రంలో రాజకీయానికి సంబంధించి ఉంటుందని తెలుస్తోంది. అందుకే నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ అంటూ.. డైలాగ్ ఇచ్చారు బాలయ్య. 2022 దసరాకు ఈ మూవీ విడుదల కానుందని తెలుస్తోంది.

also read;

విమానంలో ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు…పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్….!

భారత్ – సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కరోనా కలకలం..!

 

Visitors Are Also Reading