Home » పెళ్లికి ముందు అమ్మాయి శరీరం ఇలా ఉంటే..అర్థం అదేనా..?

పెళ్లికి ముందు అమ్మాయి శరీరం ఇలా ఉంటే..అర్థం అదేనా..?

by Sravanthi Pandrala Pandrala

పెళ్లికి ముందే అమ్మాయిలు అబ్బాయిలు పై అబ్బాయిలు అమ్మాయిలపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇందులో ముఖ్యంగా కొంతమంది అబ్బాయిలు అనవసరమైన అపోహలకు వెళ్లి అమ్మాయిలపై వివిధ రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. వారి శరీర భాగాలను బట్టి వారు ఏదో తప్పు చేసినట్టు డిసైడ్ అవుతారు. అలా కొంతమంది అబ్బాయిలు సైంటిస్టులు లాగా ఫీల్ అయిపోయి అమ్మాయిలను హింసిస్తూ, వారి క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తూ ఎన్నో వివాహాలు చేసుకున్న జంటలు ఇబ్బందుల పాలవుతున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. మరి అమ్మాయిల శరీర భాగాలను బట్టి అమ్మాయి ఎలాంటిదో డిసైడ్ చేయవచ్చా? అందులో నిజం ఎంత ఉంది?అనేది చూద్దాం..అయితే సాధారణంగా అమ్మాయిలే పెళ్లికి ముందు ఎక్కువగా కలలుకంటారు అనేది నిజం కాదు. అబ్బాయిలు ఎక్కువగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ఆమె అందం గురించి ఆలోచిస్తూ ఉంటారు.

అలా తీవ్రంగా ఆలోచించి తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తీరు నచ్చక విపరీతంగా ఇబ్బంది పెట్టి కోర్టుకెక్కిన వారు అనేకం ఉన్నారు. ఈ తరంలో చాలామంది అబ్బాయిలు అన్ని ఆలోచనలు అమ్మాయి వారితో పంచుకోవాలని భావిస్తున్నారట. వారు ఆర్థికంగా ఎమోషనల్ గా, ఫిజికల్ గా పూర్తిగా తన మీదే ఆధారపడాలని ఈ తరం భర్తల నిత్య కోరిక అని అధ్యయనంలో తేలింది. అయితే కొంతమంది అబ్బాయిలు అమ్మాయి బాడీ కొద్దిగా లూజ్ అయినా శరీరంపై స్ట్రెచ్ మార్క్స్ వచ్చినా ఆమె ఏదో తప్పు చేసిందని భావిస్తారట. ఈ స్ట్రెచ్ మార్క్స్ కొంతమంది అమ్మాయిలు నడుము భాగంలో ఏర్పడతాయి. అవి ఎలా అంటే కొంతమంది విపరీతంగా లావై మళ్ళీ డైట్ చేసి వెయిట్ లాస్ అవుతారు. అలా వెయిట్ లాస్ అయిన వారి చర్మం స్ట్రెచ్ అవ్వడం వల్ల ఈ మార్క్స్ ఏర్పడతాయి.

కొంతమంది అమ్మాయిలు డెలివరీ అయిన తర్వాత కూడా ఈ మార్క్స్ ఏర్పడతాయి. ఇది అబ్బాయి లో కూడా ఏర్పడుతుంది. అలాగే అమ్మాయిల బ్రెస్ట్ సైజును బట్టి అమ్మాయిల క్యారెక్టర్ డిసైడ్ చేస్తారట. ఈ షేప్ లో ఉంటేనే అమ్మాయి ఓకే అని, లేదంటే ఏదో తప్పు చేసిందని భావిస్తారట. అమ్మాయిలు అలాంటి మార్పు జరగడానికి కారణం తీసుకునే ఫుడ్. వారు చేసే ఎక్సర్సైజ్ కావచ్చు. కొంతమంది సరైన లో దుస్తులు వేసుకోక పోవడం వల్ల బ్రెస్ట్ సైజు లో మార్పు ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. కేవలం తప్పు చేయడం వల్లనే అమ్మాయిల శరీరంలో మార్పులు వస్తాయని క్యారెక్టర్ ను డిసైడ్ చేయడం అనేది 100% తప్పు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ALSO READ:

Visitors Are Also Reading