పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ పలు సినిమాల్లో నటించి ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడింది. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ కి ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ ఏపీ ఓటర్లకు రేణు దేశాయ్ చేసిన విజ్ఞప్తిపై ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
Advertisement
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ కి అన్యాయం చేసినా.. తన పిల్లలకు తండ్రిగా ఆయనను గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. అమ్మా నీ భర్త నీకే ద్రోహం చేశాడు.. ఇక రాష్ట్రానికి ఎంత ద్రోహం చేస్తాడమ్మా.. ఆ విషయాన్ని నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. నీ కుమారుడికి తండ్రిగా ఉన్నాడు కాబట్టి.. ఆ పిల్లల తండ్రిగా పవన్ కళ్యాణ్ ను గౌరవిస్తున్నందుకు శభాష.. అసలై, సిసలైన భారతీయ మహిళగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. కానీ నీ భర్తకు ప్రజలు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరని.. నిన్ను మోసం చేసినట్టే ప్రజలందరినీ మోసం చేస్తాడనే భావన ప్రజల్లో ఉందని పేర్కొన్నారు అంబటి రాంబాబు.
Advertisement
“ముఖ్యంగా మానవుల్లో మహిళలకు సెంటిమెంట్లు ఉంటాయి. మహిళలు భర్తలను గౌరవిస్తారు. భర్త దుర్మార్గుడే అయినా గౌరవించే సాంప్రదాయం ఉన్నటువంటి భారత సమాజంలో ఓ మంచి స్త్రీగానే రేణు దేశాయ్ మాట్లాడింది తప్ప.. ఆమెకు హృదయపూర్వకంగా ఆ అభిప్రాయం లేదనేది నా అభిప్రాయం” అంటూ వెల్లడించారు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ నటించిన ‘BRO’ మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టి తనను అవమానించారని అంబటి పేర్కొంటున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మీద కూడా అంబటి ఓ వెబ్ సిరీస్ తీయనున్నట్టు ప్రకటించారు. ఇందులో భార్యలను మోసం చేసిన కథతో వెబ్ సిరీస్ ఉండబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లోకి పిల్లలను మాత్రం లాగొద్దని.. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలని.. పిల్లలను, ఆడవాళ్లను లాగొద్దని రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజా సేవకు కట్టుబడి ఉన్నారని.. తనకు అన్యాయం చేసినా ఆయనను సపోర్టు చేస్తున్నప్పుడు ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలని రేణు దేశాయ్ కోరారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు:
పెళ్లి చేసుకోబోతున్న విశ్వక్ సేన్.. అమ్మాయి ఎవరంటే ?