varudu movie Heroine: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఇందులో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన వరుడు చిత్రం ద్వారా టాలీవుడ్ సినీ పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయింది ఈ పంజాబీ బ్యూటీ భాను శ్రీ మెహ్రా. ఈమె కూడా ఇదే కోవకు చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన హీరోయిన్గా నటించి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయంది.
ఇక వరుడు చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రల పాత్రలకు మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. మరొక విషయం ఏమిటంటే.. వరుడు సినిమా విడుదలయ్యేంత వరకు కూడా హీరోయిన్ పేరు చెప్పకుండా ఉండడం విశేషం. ఈ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ ఆ తరువాత అల్లుఅర్జున్ కి వేదం, బద్రినాథ్, తదితర చిత్రాలు హిట్ ఇవ్వడంతో మళ్లీ తన కెరీర్ పుంజుకుంది. కానీ వరుడు చిత్రంలో నటించిన హీరోయిన్ భాను శ్రీకి మాత్రం సినిమా అవకాశాలు వరించలేదు.
Advertisement
Advertisement
ఈమె ఒకానొక సమయంలో రెండవ హీరోయిన్ కామియో, గెస్ట్ అప్పియరెన్స్ పాత్రల్లో కూడా నటించడానికి సిద్ధమైంది. అయినప్పటికీ ఈమె తన సినిమా కెరీర్లో మాత్రం నిలదొక్కుకోలేకపోయిందనే చెప్పవచ్చు. దీంతో పెళ్లి చేసుకుంది. 2018లో కరణ్ అనే ప్రముఖ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లాడింది. ఇక పెళ్లి తరువాత కూడా భాను శ్రీ అడపాదడపా చిత్రాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో భానుశ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తోంది. ఫోటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ఇక మరొక వైపు అత్యంత త్వరలోనే భాను శ్రీ మెహ్రా మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నదని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు భాను శ్రీ మాత్రం తన హీరోయిన్ రీ ఎంట్రీ పై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ మధ్య కీర్తి సురేష్ మెయిన్ లీడ్ పాత్రలో నటించిన మిస్ ఇండియా చిత్రంలో ఓ చిన్న పాత్రలో భాను శ్రీ మెహ్రా కనిపించింది. ఇంకా మరికొన్ని సినిమాల్లో కూడా నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం భాను శ్రీ మెహ్రా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం.
Also Read :
“రంగస్థలం” కథను చిరంజీవి నటించిన ఆ సినిమా నుండి కాపీ కొట్టారా…?
టాలీవుడ్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ లుగా నిలిచిన 5 సీక్సెల్స్ ఇవే..!