ఇంట్లో ఉండే వస్తువులపై కొన్ని గుర్తులు ఉంటాయి. కానీ ఆ గుర్తులు ఎందుకు ఉన్నాయి….అసలు వాటి అర్థం ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలుసుకోవాలని అనిపించినా ఎవరిని అడగాలో అర్థం కాదు. దాంతో సరే తెలుసుకుందాంలే అని అలాగే వదిలేస్తారు. అలా చాలా మందికి డౌట్ వచ్చే విషయమే గ్యాస్ సిలిండర్ పై గుర్తులు ఉండటం కూడా…ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇళ్లలో గ్యాస్ సిలిండర్ లు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ లేని వారికి ప్రభుత్వం పథకాల ద్వారా సబ్సిడీలు ఇచ్చి మరీ గ్యాస్ సిలిండర్ లను అందజేసింది. అయితే ప్రతి ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ పైన కూడా ఓ కోడ్ తో గుర్తు ఉంటుంది.
Also Read: అప్పట్లో మా టీచర్లు…. ఈ పాఠం చెప్పడమే ఎగరగొట్టేవారు!
Advertisement
సిలిండర్ ను పట్టుకునే హ్యండిల్ రాడ్ కు కింద లోపలి భాగంలో పసుపు రంగలో ఆ కోడ్ కనిపిస్తుంది. అసలు ఆ కోడ్ ఏంటి ఎందుకు అలా వేస్తోరో ఇప్పుడు చూద్దాం….మన ఇండ్లలో వాడే గ్యాస్ సిలిండర్ లు అన్నింటినీ ఎంతో ప్రెజర్ ను తట్టుకునేలా చాలా ధృడంగా తయారు చేస్తారు. అయితే సిలిండర్ ను భయట పెట్టడం..వాతావరణ పరిస్థితులకు తుప్పు పట్టడం ఇతర కారణాల వల్ల గ్యాస్ సిలిండర్ లు డ్యామేజ్ అయ్యి గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంది. అలా గ్యాస్ లీక్ అయితే పెను ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ప్రతి సిలిండర్ ను కొన్ని సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేయాలని ఓ రూల్ కూడా ఉంది. సాధారణంగా అయితే ఒక సిలిండర్ లైఫ్ టైమ్ 17 సంవత్సరాలు ఉంటుంది.
Advertisement
Also Read: యాంకర్ అనసూయ తండ్రి సుదర్శన్ రావు మృతి.
ఇక అలా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి గ్యాస్ సిలిండర్ ను టెస్ట్ చేయాలి అన్నదాన్ని తెలిపేదే ఆ కోడ్. ఆ కోడ్ లో ఏ, బీ,సీ,డీ అనే అక్షరాలు మనకు కనిపిస్తుంటాయి. ఆ అక్షరాలు నెలలను సూచిస్తాయి. ఏ అక్షరం జనవరి నుండి మార్చి క్వాటర్….బీ అక్షరం ఎప్రిల్ జూన్ క్వార్టర్…సీ అక్షరం సెప్టెంబర్ క్వార్టర్….డీ డిసెంబర్ క్వార్టర్ ఇలా సూచిస్తాయి. ఇక పక్కన ఉంటే సంఖ్యలు సంవత్సరాలను సూచిస్తాయి. ఊదాహరణకు అక్షరం పక్కకు 23 ఉంటే 2023లో అక్షరం సూచించే నెలలో టెస్టింగ్ కు పంపాలి. అదే 24 ఉంటే 2024 సంవత్సరంలో ముందు ఉన్న అక్షరం సూచించే నెలలో టెస్టింగ్ కు పంపాలి.
Also Read: క్రికెట్ చరిత్రలో టెస్ట్ ఇన్నింగ్స్ లో 10వికెట్లు తీసిన క్రికెటర్లు వీరే..!