Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » క్రికెట్ చ‌రిత్ర‌లో టెస్ట్ ఇన్నింగ్స్ లో 10వికెట్లు తీసిన క్రికెట‌ర్లు వీరే..!

క్రికెట్ చ‌రిత్ర‌లో టెస్ట్ ఇన్నింగ్స్ లో 10వికెట్లు తీసిన క్రికెట‌ర్లు వీరే..!

by AJAY
Ads

భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో కివీస్ బౌలర్ రికార్డు సృష్టించారు. కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ ఏకంగా పది వికెట్లు తీసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కివీస్ బౌలర్ దెబ్బకు భారత ఆటగాళ్ళు వరుసగా వికెట్లను సమర్పించుకున్నారు.

Advertisement

azaz patel

azaz patel

ఇదిలా ఉండగా 1956లో మొదటిసారిగా జిమ్ లేకర్ అనే ఇంగ్లాండ్ ఆటగాడు 10 వికెట్లను తీశారు. అంతేకాకుండా పాకిస్తాన్ తో ఓ ఇన్నింగ్స్ లో భారత బౌలర్ అనిల్ కుంబ్లే కూడా పది వికెట్లను తీశాడు.

Ad

Advertisement

Jim Laker

Jim Laker

ఆ తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ అదే రికార్డును సృష్టించి వరుసగా పది వికెట్లు తీసిన మూడో బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అజాజ్ ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు.

Anil Kumble

Anil Kumble

ఇదిలా ఉండగా ముంబైలో జరుగుతున్న రెండవ టెస్ట్ లో ఇండియా 325 పరుగులు చేసింది. కివీస్ బౌలర్ దాటికి ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. అజాజ్ మొత్తం 45.5 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. పది వికెట్లు తీసి రికార్డు సృష్టించడం తో ఆజాజ్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also read : ఓ దేశంలో పుట్టి మ‌రోదేశం త‌ర‌పున ఆడుతున్న క్రికెక‌టర్లు వీరే..!

Visitors Are Also Reading