ప్రముఖ టాలీవుడ్ నటి, జబర్దస్త్ ఫేమస్ యాంకర్ అనసూయ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జబర్దస్త్ యాంకర్ అనసూయ తండ్రి సుదర్శన్ రావు మృతి చెందారు. హైదరాబాద్ తార్నాక లోని ఆయన సొంత నివాసంలో సుదర్శన్ రావు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఇవాళ వేకువజాము నుంచి తీవ్ర అస్వస్థతకు లోనైన సుదర్శన్ రావు… కాసేపటి క్రితమే మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.
read aslso : ప్రిన్స్ మహేష్ ఎందుకు ఎప్పుడు యంగ్ గా ఉంటాడో తెలుసా?
సుదర్శన్ రావు చాలాకాలంపాటు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సుదర్శనరావు చాలా చురుగ్గా పని చేసేవారు. ఇక తండ్రి సుదర్శన్రావు మరణించడంతో యాంకర్ అనసూయ కుటుంబం తీవ్ర విషాదం లోకి వెళ్ళింది. సుదర్శన్ రావు మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు అలాగే ఆయన స్నేహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎలా మృతిచెందారు అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.