Home » కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాని కాపీ కొట్టబోయి ఫ్లాప్ అయిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా ?

కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాని కాపీ కొట్టబోయి ఫ్లాప్ అయిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా ?

by Anji
Ad

దర్శకుడు కే.విశ్వనాథ్ తెరకెక్కించిన అద్భుతమైన క్లాసికల్ మూవీ స్వాతిముత్యం. ఈ చిత్రం మార్చి 27, 1985న విడుదల అయింది. ఇందులో కమల్ హాసన్ హీరోగా.. రాధిక హీరోయిన్ గా నటించారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నప్పుడే భర్త పోతే ఎదుర్కున్న పరిస్థితులు.. అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు.. ఆ తరువాత వారిద్దరి జీవన ప్రయాణం ఎలా కొనసాగిందనేది ఈ చిత్రం యొక్క కథ. 

Advertisement

మంద బుద్ది కలిగిన పాత్రలో కమల్ హాసన్ నటించగా.. అత్యంత లోతైన భావాలు కలిగిన పాత్రలో రాధిక నటించింది. ఈ చిత్రం అప్పట్లోనే ఆస్కార్ కి వెళ్లడం విశేషం. అంతేకాదు.. మంచి కమర్షియల్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమాలో నటించిన కమల్ హాసన్ కి, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి,  దర్శకుడు కే.విశ్వనాథ్ కి ఉత్తమ జాతీయ అవార్డులతో పాటు నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. స్వాతిముత్యం సక్సెస్ సాధించిన తరువాత తమిళంలో కూడా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేశారు. అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇక ఆ తరువాత కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేయబడింది. ఈ సినిమాలో అప్పటికే కమర్షియల్ స్టార్ హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన కమల్ హాసన్ తన పరిధిని తగ్గించుకొని మందబుద్ధి కలిగిన పాత్రలో నటించడం అప్పట్లో పెద్ద సాహసమనే చెప్పాలి. 

Advertisement

Also Read :  మురళీమోహన్, జయసుధ అంతటి స్టార్లు అయ్యారంటే కారణం ఆయనే..!!

Manam News

ఒక మంది బుద్ధి పాత్రకు లవ్ సాంగ్ పెట్టడం అంటే.. ఆ దర్శకుడికి పెద్ద ఛాలెంజింగ్ విషయం అనే చెప్పాలి. ఆ పాట మరేదో కాదు.. మనసు పలికే మౌనగీతం.. ఈ చిత్రంలో కమల్ హాసన్, రాధిక ఒకరితో ఒకరు ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. కమల్ హాసన్ రాధికతో ఎలా రొmaన్స్ చేసాడో అదేవిధంగా చిరంజీవి కూడా అలాగే చేయాలని ప్రయత్నించాడట. ఆరాధన చిత్రం కోసం హీరోయిన్ సుహాసినితో చిరంజీవి అలాగే చేయాల్సి ఉండగా.. కమల్ హాసన్ ని కాపీ కొట్టబోయి విఫలం చెందారట. ఒకరినీ కాపీ కొట్టడంలో ఎలాంటి ఉపయోగం ఉండదని.. మీలా మీరు నటించండి అంటూ దర్శకుడు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట చిరంజీవి.  

Also Read :  ఉదయ్ కిరణ్, శ్రియా చేయాల్సిన “ఆనందం” చిత్రం చేతులు ఎందుకు మారిందో మీకు తెలుసా ?

Visitors Are Also Reading