అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుకు అప్పట్లో బెంగాలీ సాహిత్యం పట్ల, సినిమాల పట్ల చాలా అభిమానం ఉండేది. ‘వెలుగునీడలు’ సినిమా ఘనవిజయం తరవాత మరో చిత్రాన్ని నిర్మించేందుకు దుక్కిపాటి మళ్లీ బెంగాలీ చిత్ర పరిశ్రమను ఆశ్రయించారు. మంగళ చట్టోపాధ్యాయ 1957లో నిర్మించిన బెంగాలీ సినిమా ‘తాషేర్ ఘర్’ సినిమా దుక్కిపాటికి బాగా నచ్చింది. దీంతో ‘తాషేర్ ఘర్’ సినిమా హక్కులను దుక్కిపాటి కొనుగోలు చేశారు. డప్నే-డు-మారియర్ నవల ‘ది స్కేప్ గాట్’ కు చాలా దగ్గరి పోలికలు ఉండటంతో, ‘తాషేర్ ఘర్’ సినిమా కథకు సమూలంగా మార్పులు చేసారు. ‘తాషేర్ ఘర్’ ప్రధాన పాత్రలను మాత్రమే తీసుకొని, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, సహకార దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్, సీనియర్ జర్నలిస్టు గోరా శాస్త్రి, నిర్మాత దుక్కిపాటి తో కూడిన అన్నపూర్ణ చిత్ర యూనిట్ నూతన కథకు శ్రీకారం చుట్టారు.
Advertisement
అలా చేసిన చిత్రమే అక్కినేని నాగేశ్వరరావు మొదటిసారి ద్విపాత్రాభినయం చేసి సూపర్ హిట్ గా నిలిచిన ‘ఇద్దరు మిత్రులు’. ఈ మూవీ డిసెంబర్ 29,1961 లో విడుదలైంది. అన్నపూర్ణ వారి తొలిచిత్రం ‘దొంగరాముడు’ 1955 నుంచి ‘తోడికోడళ్ళు’, ‘మాంగల్యబలం’, ‘వెలుగునీడలు’ చిత్రాలలో నాయికగా నటించి మెప్పించిన సావిత్రికి ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలో పాత్ర లేకపోవడం విశేషం. ఈ సినిమాలో అజయ్, విజయ్ అనే ఇద్దరు అపరిచితులు అనుకోకుండా కలుస్తారు. వారి కష్టాలను పంచుకోవడం. అజయ్ ఒక మల్టీ మిలియనీర్, విదేశాలలో చదువుతూ తన తండ్రి మరణవార్త తెలిసి తిరిగి వస్తాడు. ఆ దుస్థితిలో, అతని దుర్మార్గుడు, మోసపూరితమైన మేనేజర్ భానోజీ రావు, విధేయుడిగా నటిస్తూ, అతని సంపదను దోచుకోవడానికి అతడిని భారీ అప్పుల్లో పడేస్తాడు. మరోవైపు విజయ్ నిరుపేద కుటుంబానికి చెందిన పట్టభద్రుడు, నిరుద్యోగంతో బాధపడుతుంటాడు.
Advertisement
అతని సోదరి మీనను ఆమె అత్తమామలు కట్నం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లగొడతారు. అతని అమాయక భక్తిగల తండ్రి రామదాసు వారికి మద్దతు ఇచ్చారు. ఇద్దరూ పరస్పర ఒప్పందంతో ఓ ఏడాది కాలం పాటు స్థలాలను మార్చుకోవాలని నిర్ణయించుకుంటారు. విజయ్ స్థానంలో అజయ్ ఆప్యాయత, కుటుంబ బంధంతో చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ విజయ్ తన భావాల ద్వారా అజయ్ తండ్రి తరపు అత్త చేత పట్టుబడుతాడు. విజయ్‌పై కోపంగా ఉన్నాడు అజయ్. అజయ్ నుంచి వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత ఆమె కూడా వారికి సహాయం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ. ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు హైదరాబాద్ దీపక్ మహల్ లో జరిగాయి. అలనాటి నటి సావిత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు ప్రదానం చేయడం విశేషం.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్!
Sudigali sudheer : సుడిగాలి సుదీర్ కు బంపర్ ఆఫర్… ఏకంగా స్టార్ హీరోయిన్ తో సినిమా!