Home » రాజమౌళి తీరుతో కోపానికి గురైన  సీనియర్ నటుడు ఎవరో తెలుసా ?

రాజమౌళి తీరుతో కోపానికి గురైన  సీనియర్ నటుడు ఎవరో తెలుసా ?

by Anji
Ad

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే తెలుగు సినిమా ప్రపంచ సినిమాల కంటే ఎంత మాత్రం తక్కువ కాదని చూపించిన ఏకైక వ్యక్తి రాజమౌళి.

jr.ntr

Advertisement

అలాంటి రాజమౌళి సినీ కెరీర్ ప్రారంభంలో  దర్శకుడు రాఘవేంద్ర రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన టాలెంట్ ని గుర్తించిన రాఘవేంద్రరావు అతనికి ఓ సీరియల్ తీసే అవకాశాన్ని ఇచ్చారు. ఆ సీరియల్ శాంతి నివాసం ఈటీవీలో ప్రసారమైంది. ఈ సీరియల్ లో మెయిన్ రోల్ లో సీనియర్ నటుడు అయినటువంటి రంగనాథ్ నటించారు. 

రంగనాథ్ నటనలో చాలా గొప్పవాడు. కానీ అప్పటికీ రాజమౌళికి సినిమాలు, సీరియల్స్ తీసిన అనుభవం లేదు. అయితే శాంతినివాసం సీరియల్ ని రాజమౌళి సినిమా రేంజ్ లో తీసేవాడట. తాను అనుకున్న షాట్ రావడం కోసం ఎన్ని టేకులు అయిన ఎన్ని రోజులు అయినా అలా షూట్ చేస్తూ.. ఉండేవాడట. ఈ క్రమంలోనే ఆ సీరియల్ నటించిన సీనియర్ నటుడు రంగనాథ్ నటించేటప్పుడు తాను చేస్తున్న నటన కాకుండా కొంచెం వెరియేషన్స్ అడగడంతో రంగనాథ్ గారు కొంచెం కోపానికి గురయ్యారట. 

Advertisement

Also Read :  నెటిజన్ వర్సెస్ అనసూయ…సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా లేదుగా…!

కోపానికి గురైన రంగనాథ్ దర్శకుడు రాజమౌళిని తిట్టారట. అదంతా జరిగినప్పటికీ కూడా రాజమౌళి అదేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడట. అలా రాజమౌళి తీసినటువంటి సీరియల్ సూపర్ హిట్ అయింది. ఆ తరువాత రాజమౌళి సినిమాలు తీసి టాప్ దర్శకుడయ్యాడు. రాజమౌళి సినిమాల్లో శాంతినివాసం సీరియల్ లో నటించిన అందరూ నటీనటులు కనిపించేవారు కానీ ఒక్క రంగనాథ్ మాత్రం రాజమౌళి తీసిన ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. దానికి ఆరోజు రంగనాథ్ రాజమౌళితో ప్రవర్తించిన తీరు తనకు నచ్చకపోవడంతోనే అతన్ని తీసుకోలేదని స్పష్టమవుతుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ దర్శకుడు రాజమౌళి, సీనియర్ నటుడు రంగనాథ్ మధ్య మాటల యుద్ధం బాగానే జరిగినట్టు తెలుస్తోంది.  

Also Read :   జగపతి బాబు భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా ?

Visitors Are Also Reading