టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది మిమిక్రీ ఆర్టీస్టులు ఉన్నారు. వారిలో కొందరూ స్టార్ హీరోలకు, కమెడీయన్లకు, విలన్లకు ఇలా వారు వీరు అని తేడా లేకుండా వాయిస్ డబ్బింగ్ చెబుతుంటారు. అదేవిధంగా సర్కారు వారి పాట సినిమా డబ్బింగ్ అవకాశం వచ్చిందనుకున్న తరుణంలోనే చే జారిపోయిందని ఓ నటుడు వెల్లడించాడు. అతను మామూలుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు అద్భుతంగా డబ్బింగ్ చెబుతాడంటా. మహేష్ బాబు ఓ సినిమాకు మొత్తం అతనే డబ్బింగ్ చెప్పడం విశేషం. అతను మరెవ్వరో కాదు. బుల్లితెర నటుడు బుల్లెట్ భాస్కర్.
మహేష్ బాబు సినిమాకు వాయిస్ డబ్బింగ్ చెప్పినా కానీ ఇప్పటివరకు అతను మహేష్ బాబును డైరెక్ట్‌గా అసలు కలవకపోవడం విశేషం. కానీ ఓ సారి ఫోటో కోసం కలిశానని.. ఫోటో తీయగానే వెంటనే వెళ్లిపోయాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు బుల్లెట్ భాస్కర్. కానీ నేను మాత్రం ఆ హీరోకు తెలుసు. అయితే సర్కారు వారి పాట సినిమాకు కలుస్తానని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నాలుగు రోజులు సర్కారు వారి పాట సినిమా డబ్బింగ్ వేరే వారికి ఇచ్చేసారు. ఇంకా నేను చాలా యాడ్స్‌కు తాను డబ్బింగ్ చెబుతానని చెప్పారు. సీజన్ మారిన సమయంలో ఎక్కువగా నేను చెబుతుంటాను. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్‌సినిమాలోని డైలాగ్‌లను చెప్పాడు భాస్కర్. వన్ నేనొక్కడినే సినిమాలో సమాది వద్ద చిన్న పిల్లాడు ఏడ్చుతున్నట్టు చెప్పిన డైలాగ్ నేను వాయిస్ ఇచ్చానని చెప్పాడు. అమ్మ లేకుండా నేను పడుకోలేను. మహేష్ బాబు మాట్లాడితే పక్కన ఉన్న వారికి కూడా వినిపించదు. ఆయన అంత స్లోగా మాట్లాడుతాడు.
Advertisement
Advertisement
మహేష్ బాబు గారి ఇష్టమైన డైలాగులు ఏవి యాంకర్ ప్రశ్నించగా.. మహేష్ బాబు అంటే ఇష్టమేనని.. భాస్కర్ అన్ని డైలాగ్‌లు అంటే ఇష్టమే. రాజకుమారుడు, ఒక్కడు, అర్జున్ సినిమాల్లో డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు అందుబాటులో లేకున్నా బుల్లెట్ భాస్కర్ డబ్బింగ్ చెబితే అచ్చం మహేష్ బాబు చెప్పినట్టే ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో భాస్కరే చెప్పడం విశేషం. చాలా వరకు ఎక్కువ మిమిక్రీ చేయాలంటే సాధ్యం కాదు. అందరి వాయిస్‌లు మిమిక్రి చేయాలంటే కష్టంతో కూడుకున్న పనే అని.. కొంత మంది వాయిస్‌లను మాత్రమే చేయగలం. అందులో మహేష్ బాబు ఒకరు. నేను ఇప్పటికీ బాధపడతాను. స్టార్ కమెడీయన్ బ్రహ్మనందం వాయిస్ నాకు డబ్బింగ్ చెప్పడం ఎందుకు రాదని బుల్లెట్ భాస్కర్ వెల్లడించారు. ఏదీ ఏమైనా ఫర్‌ఫెక్ట్‌గా మిమిక్రి వచ్చి ఉంటే సినిమా హీరోలు అందుబాటులో లేని సమయంలో వారితో డబ్బింగ్ చేయవచ్చని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక మహేష్ బాబు యాడ్స్‌కి దాదాపుగా బుల్లెట్ భాస్కర్ డబ్బింగ్ చెబుతారట.
Also Read :
సమంతకు ఏమయ్యింది..? డెడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆ వెంటనే ఎందుకలా చేసింది..!