Home » టిక్ టాక్ దుర్గారావు నెలకు ఎంత ఎంత సంపాదిస్తున్నారో తెలుసా …?

టిక్ టాక్ దుర్గారావు నెలకు ఎంత ఎంత సంపాదిస్తున్నారో తెలుసా …?

by AJAY

ఒకప్పుడు సెలబ్రెటీలు అంటే సినిమా వాళ్ళు…. సీరియల్ వాళ్ళు మాత్రమే. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకున్న వాళ్లు కూడా సెలబ్రిటీగా మారిపోతున్నారు. ముఖ్యంగా టిక్ టాక్ ద్వారా ఎంతోమంది సెలబ్రిటీ స్టేటస్ ను అందుకున్నారు. టాలెంట్ ఉండి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వీడియో లు చేసిన చాలామంది సెలబ్రిటీలు గా మారి ప్రస్తుతం బుల్లితెర, వెండితెర పై రాణిస్తున్నారు.

అలాంటివారిలో టిక్ టాక్ దుర్గారావు కూడా ఒకరు. టిక్ టాక్ లో ఓల్డ్ సాంగ్స్ కు తనదైన శైలిలో భార్యతో కలిసి స్టెప్పులు వేసిన దుర్గారావు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారారు. లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. దుర్గారావు తన భార్యతో కలిసి “పలాస” సినిమా నుండి నాది నక్కిలేసు గొలుసు అనే పాటకు స్టెప్పులు వేశారు. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. దాంతో ఢీ షోలో కూడా దుర్గారావును అనుసరిస్తూ డాన్స్ చేశారు.

ఇక ఆ తర్వాత దుర్గారావు జబర్దస్త్ నుండి ఆహ్వానం అందుకున్నారు. మొదట సుధీర్ స్కిట్ లో కనిపించారు. ఆ తర్వాత పలు చిన్న చిత్రాలలో చేయడంతోపాటు అదిరింది షో లో కూడా కనిపించారు. మరోవైపు యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియో లు చేస్తూ వినోదాన్ని పంచుతారు.

అయితే గతంలో దుర్గారావు బట్టలు నేసి కుటుంబాన్ని పోషించే వారు. కానీ సోషల్ మీడియా తో సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న తరువాత నెలకు ఏకంగా లక్షలలో సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. టీవీ షోలు, సినిమాలతో పాటు యూట్యూబ్ ద్వారా దుర్గారావు నెలకు రూ.50వేలు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.

Also read : ఆ హీరోతో న‌దియా పెళ్లి వ‌ర‌కూ వెళ్లిందా…? చివ‌రికి ఏం జ‌రిగిందంటే..!

 

Visitors Are Also Reading