Home » బాల‌కృష్ణ-శ్రీ‌నువైట్ల కాంబోలో వ‌చ్చిన ఈ సినిమా గురించి మీకు తెలుసా ?

బాల‌కృష్ణ-శ్రీ‌నువైట్ల కాంబోలో వ‌చ్చిన ఈ సినిమా గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

ద‌ర్శ‌కుడి శ్రీ‌నివైట్ల గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఒక‌ప్పుడు వ‌రుస స‌క్సెస్ సినిమాల‌తో టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ ల‌లో ఒక‌రిగా కొన‌సాగారు. ఇక ఈ ఆ త‌రువాత వ‌రుస ఫ్లాప్‌లు ప‌లుక‌రించ‌డంతో కాస్త సైలెంట్ అయిపోయారు. ర‌వితేజ‌తో తెర‌కెక్కించిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమా డిజాస్ట‌ర్ త‌రువాత ఈయ‌న ఖాళీగా ఉన్నాడు. అంతకు ముందు ఆగ‌డు, బ్రూస్లీ, మిస్ట‌ర్ వంటి సినిమాలు కూడా శ్రీ‌నువైట్ల ఉనికిని ప్ర‌శ్నార్థ‌కం చేసాయి. త్వ‌ర‌లో ఇత‌ను గోపిచంద్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల‌.

Also Read : మ‌నోజ్ రెండో పెళ్లి పై మంచు ల‌క్ష్మి కామెంట్స్…వామ్మో..అంత మాట అనేసిందిగా..?

Advertisement

ఇక అంతేకాదు.. ఈయ‌న కెరీర్ ప్రారంభ‌మైంది బాల‌య్య సినిమాతోనే అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన ఓల్డ్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ప్రాణానికి ప్రాణం సినిమాతో శ్రీ‌నువైట్ల కెరీర్ మొద‌లైంది. ఈ చిత్రానికి చ‌ల‌సాని రామారావు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఆశించిన ఫ‌లితం రాక‌పోవ‌డంతో శ్రీ‌నువైట్ల నిరాశ చెందిన‌ట్టు చెప్పుకొచ్చారు. ఆ త‌రువాత సాగ‌ర్‌, ఈవీవీ స‌త్యనారాయ‌ణ ద‌గ్గ‌ర అసిస్టెంట్ ద‌ర్శ‌కునిగా ప‌ని చేశారు. రాజ‌శేఖ‌ర్ హీరోగా అప‌రిచితుడు సినిమాతో ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం వ‌చ్చింద‌ని చెప్పారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ వ‌ర్క‌వుట్ కాలేదు. శ్రీ‌ను వైట్ల ర‌వితేజ హీరోగా నీకోసం సినిమాతో ద‌ర్శ‌కునిగా మారారు. ఆ త‌రువాత ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్‌లో ఆనందంతో ద‌ర్శ‌కుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. ఇక ఈయ‌న బాల‌య్య‌తో ఒక సినిమాను తెర‌కెక్కించారు.

Advertisement

Also Read : ఐశ్వ‌ర్య ధ‌నుష్ విడాకుల విష‌యంలో ఊహించ‌ని ట్విస్ట్…మ‌ళ్లీ క‌లవ‌బోతున్నారా..?

బాల‌య్య సినిమాతో ద‌ర్శ‌కునిగా ప్ర‌స్థానం ప్రారంభించిన శ్రీ‌ను వైట్ల ఆయ‌న‌ను డైరెక్ట్ చేసింది ప‌ర‌మ‌వీర చ‌క్ర సినిమాలో. దాస‌రినారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో బాల‌కృష్ణ ఆర్మీ మేజ‌ర్‌గా, సినీ న‌టుడిగా న‌టించారు. ఈ సినిమాలో శ్రీ‌నువైట్ల త‌న నిజ జీవిత పాత్ర అయిన ద‌ర్శ‌కుడిగా బాల‌య్య‌ను ఈ చిత్రంలో డైరెక్ట్ చేశారు. భ‌విష్య‌త్‌లో బాల‌య్య‌తో శ్రీ‌నువైట్ల సినిమా తెర‌కెక్కిస్తే చూడాల‌నుకునే అభిమానులు ఉన్నారు. బాల‌య్య శ్రీ‌నువైట్ల‌కి అవ‌కాశం ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. గోపిచంద్ మ‌లినేని సినిమా త‌రువాత అనిల్ రావిపూడి, బాబీ, కొర‌టాల శివ‌, సింగీతం సినిమాలు లైన్ లో ఉన్నాయి.

Also Read : తీన్మార్ నుండి గాడ్ ఫాదర్ వరకు మెగా హీరోల రీమేక్ సినిమాలు….! ఎన్ని హిట్ ఎన్ని ఫట్…?

Visitors Are Also Reading