సాధారణంగా చాలా మంది ముఖంపై పెట్టే శ్రద్ధ మెడపై పెట్టరు. అందుకే కొందరి మొహం తెల్లగా మెరిసిపోతుంటుంది. మరికొందరిది నల్లగా కమిలి పోతుంటుంది. ముఖం ఎంత తెల్లగా ఉన్నా కానీ మెడ మాత్రం నల్లగా ఉంటుంది. ఇక నెక్ డార్క్‌నెస్‌ను పోగొట్టుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. మెడపై వివిధ ప్రయోగాలు చేస్తారు. అయినప్పటికీ మెడ నలుపు పోకుంటే ఏం చేయాలో అర్థంకాక తీవ్రంగా మదనపడి పోతుంటారు. ఇప్పుడు చెప్పబోయే అద్భుతమైన ఇంటి చిట్కాను ప్రయత్నిస్తే సులభంగా నెక్ డార్క్‌నెస్ ను పోగొట్టుకోవచ్చు. ఆలస్యం ఎందుకు ఇప్పుడు ఈ చిట్కా గురించి తెలుసుకుందాం.
ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె సిద్ధం చేసుకుని ఉంచాలి. ఆ తరువాత ఓ గ్లాస్ వాటర్ ఆ గిన్నెలో పోయాలి. వాటర్ వేడి కాగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. అలా ఉడికిస్తే జెల్ తయారు అవుతుంది. ఆ జెల్‌ను ఒక పలుచటి కాటన్ వస్త్రం సాయంతో సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి.
ఆ తరువాత ఇందులో తొలుత తయారు చేసి సిద్ధం చేసి ఉంచిన అవిసె గింజల జెల్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ అల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని బ్రెష్ సాయంతో మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. బాగా డ్రై అయిన వెంటనే కొద్దిగా వాటర్ జల్లి వేళ్లతో మెల్లమెల్లగా రుద్దుకుంటూ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపై తడిలేకుండా టవల్‌తో తుడుచుకుని ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి చేస్తే కనుక నలుపు పోయి మెడ తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.
ఇవి కూడా చదవండి :
- Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు మనోధైర్యాన్ని కోల్పోవద్దు
- APRIL 19th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!
- కేజీఎఫ్ సంగీత దర్శకుడు గతంలో ఏమి పని చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!