Home » ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ ఫ్యామిలీ గురించి మీకు తెలుసా ?

ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ ఫ్యామిలీ గురించి మీకు తెలుసా ?

by Anji

ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజ కుటుంబాలు మధ్యప్రాచ్యం నుంచి వచ్చాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రజాస్వామ్యం అమలులోకి రాకముందు రాజు, రాజ కుటుంబాల పాలన కొనసాగేది. ప్రస్తుతం ఆ యుగం ముగిసిపోయింది. కానీ బ్రిటీషు రాజకుటుంబం ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబంగా భావిస్తారు. కింగ్ చార్లెస్III  అధికారికంగా అతని భార్య క్వీన్ కన్సార్ట్ కెమిల్లాతో పాటు దేశాధినేతగా పట్టాభిషేక్తిడైన నేపథ్యంలో యునైటేడ్ కింగ్ డమ్ రాయల్ ఫ్యామిలీ రిచెస్ట్ ఫ్యామిలీ అనుకుంటారు. భారీ సంపద గురించి పట్టాభిషేక వేడుకకు ఖర్చు చేసిన డబ్బు గురించే మాట్లాడుకుంటారు.

కానీ ఆశ్చర్యకరంగా ది రాయల్ ఫ్యామిలీ ఆఫ్ సౌదీ ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబంగా నిలుస్తోంది. ఎందుకు అంటే 1.4 ట్రిలియన్లు డాలర్ల సంపదతో బ్రిటిషు రాజకుటుంబం కంటే 16 రెట్లు విలువైన సంపద ఈ సౌదీ ఫ్యామిలీ సొంతం. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలోని సౌదీ రాజకుటుంబంలో 15,000 మందికి పైగా సభ్యులున్నారు. వారి సంపదలో ఎక్కువ భాగం దేశంలోని విస్తారమైన చమురు నిల్వల ద్వారా వచ్చిన ఆదాయమే . సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమై అల్ యమామా ప్యాలెస్ లో నివసిస్తున్నారు. అగ్రశ్రేణి లగ్జరీ బ్రాండ్ లను మాత్రమే ధరించే వీరి ఖజానాలో టన్నుల కొద్ది బంగారం-వెండితో పాటు విలువైన వజ్రాలు లెక్కలేనన్నీ ఉన్నాయి. 

గ్రాండ్ ప్యాలెస్ లో కోట్లాది విలువైన ప్రైవేట్ జెట్ లు ఉన్నాయి. ఖరీదు అయిన బంగారు పూతతో కూడిన కారు ఉది. కోట్ల విలువైన లగ్జరీ కార్లు లంబోర్ఘిని అవెంటడోర్ సూపర్ వెలోస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, మెర్సిడేస్ జీప్, బెంట్లీ ఉన్నాయి. 2011లోనే ఫోర్బ్స్ అతని.. అతని తక్షణ కుటుంబ సంపద సుమారు 21 బిలియన్లుగా అంచనా వేసింది. యమామా ప్యాలెస్ లో సినిమా థియేటర్ లో అనేక స్విమ్మింగ్ పూల్స్ మసీదు కూడా ఉంది. ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 400 మిలియన్ డాలర్ల సెరీన్ సూపర్ యాచ్, విలాసవంతమైన క్రూయిజ్ షిప్ లు కలిగి ఉన్నారు. ఈ భారీ క్రూయిజ్ లో 2 హెలిప్యాడ్ లు స్పోర్ట్స్ గ్రౌండ్ తో సహా అనేక సౌకర్యాలున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య విమానం బోయింగ్ 747-400 రాజకుటుంబం సొంతం. ప్రత్యేక విమానంలో ప్యాలెస్ లో ఉండే సౌకర్యాలు ఉండటం మరో విశేషం.

సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా తన కుమార్తెకు బంగారంతో చేసిన టాయిలెట్ ని బహుమతిగా ఇచ్చాడట. సౌదీ అరేబియా రాజకుటుంబం తరువాత.. ప్రపంచంలోని రెండో అత్యంత సంపన్న రాజ కుటుంబీకులు కువైట్ నుంచి వచ్చారు. మొత్తం కుటుంబం 360 బిలియన్ల డాలర్లకు పైగా ఉంది. ఇక కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని యూకే రాయల్ ఫ్యామిలీ మొత్తం నికర విలువ 88 బిలియడాలర్లు. భారతీయ కరెన్సీలో రూ.7.22 లక్షల కోట్లతో ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన రాయల్ లలో 5వ స్థానంలో ఉన్నారు. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Mahesh babu: మహేష్ బాబు ఏ ఇతర హీరో సినిమా ఈవెంట్స్ కి ఎందుకు రారో తెలుసా? అసలు కారణం ఏంటంటే?

నిద్ర లేవగానే వేటిని చూస్తే మంచిదో తెలుసా…వీటిని చూస్తే దరిద్రమే !

Visitors Are Also Reading