Home » కె.విశ్వనాథ్ తో ఎన్టీఆర్, ఏఎన్నార్ కి ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి మీకు తెలుసా ? 

కె.విశ్వనాథ్ తో ఎన్టీఆర్, ఏఎన్నార్ కి ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి మీకు తెలుసా ? 

by Anji
Ad

సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లలాంటి వారు అని పేర్కొంటుంటారు. వారిద్దరూ నటించిన పలు చిత్రాలకు అసోసియేట్ గా పని చేస్తూనే.. తాను సినిమా కళను అధ్యయనం చేశానని కె.విశ్వనాథ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. విజయసంస్థ ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన పాతాళ బైరవి, పెళ్లి చేసి చూడు, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు వంటి సినిమాలకు కె.విశ్వనాథ్ సౌండ్ విభాగంలో పని చేసారు. అన్నపూర్ణ సంస్థలో ఏఎన్నార్ నటించిన తోడికోడళ్లు, మాంగళ్యబలం, డాక్టర్ చక్రవర్తి చిత్రాలతో పాటు ఆదుర్తి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు మంచి మనసులు, మూగమనసులు వంటి సినిమాలకు అసోసియేట్ గా పని చేశారు విశ్వనాథ్. 

Advertisement

1965లో ఆత్మగౌరవం చిత్రంతో దర్శకుడయ్యాడు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన తొలి సినిమాకు ఏఎన్నార్ హీరోగా నటించాడు. ఇక ఆ తరువాత ఏఎన్నార్ తో మళ్లీ 23 ఏళ్లకు అనగా.. 1989లో సూత్రదారులు చిత్రాన్ని రూపొందించారు. విశ్వనాథ్ చిత్రంలో నటించడానికి ఏఎన్నార్ అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారో మాత్రం తెలియదు. ఏఎన్నార్ తో పాటు ఎన్టీఆర్ తో కూడా విశ్వనాథ్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ ని స్టార్ హీరోగా నిలిపిన విజయ సంస్థతో విశ్వనాథ్ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యంకి మంచి అనుబంధం ఉండేది. విజయ సంస్థ నిర్మించినటువంటి సినిమాలను విడుదల చేసే సమయంలో, వాటి ప్రచారం చేసేటప్పుడూ సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణికి సుబ్రహ్మణ్యం సహకరిస్తుండేవారు. అలా విశ్వనాథ్ తండ్రి సుబ్రహ్మణ్యంతో ఎన్టీఆర్ కి పరిచయముంది. 

Advertisement

Also Read :  ఎన్టీఆర్ హీరోయిన్ సమీరారెడ్డి గుర్తుందా …? ఇప్పుడు ఎలా ఉందంటే ..?

Manam News

 

విశ్వనాథ్ దర్శకుడయ్యాడని తెలియగానే ఎన్టీఆర్ చాలా సంతోషపడ్డారట. తనతో సినిమా తీయమని విశ్వనాథ్ ని కోరారట ఎన్టీఆర్. అలా.. ఎన్టీఆర్ తో కలిసొచ్చిన అదృష్టం (1968), నిండు హృదయాలు (1969), చిన్ననాటి స్నేహితులు (1971), నిండు దంపతులు (1971) తెరకెక్కించారు. ఈ సినిమాలలో చిన్ననాటి స్నేహితులు చిత్రాన్ని డీవీఎస్ రాజు నిర్మించగా.. మిగిలిన మూడు చిత్రాలను మిద్దె జగన్నాథరావు నిర్మించారు. ఈ నాలుగు సినిమాలకు కూడా టీవీరాజు సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతిముత్యం (1986) శ్రుతిలయలు (1987) సినిమాల ద్వారా ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డులు అందుకున్నారు. ఎన్టీఆర్ మళ్లీ కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించాలని ఉందని నంది అవార్డు అందజేసే సందర్భంలో చెప్పుకొచ్చారు.  అయితే కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం చిత్రం విడుదల తేదీ రోజే ఆయన మరణించడం గమనార్హం. 

Also Read :  K Viswanath : కళాతపస్వి విశ్వనాథ్ ఇకలేరు..!

Visitors Are Also Reading