Home » ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు గురించి మీకు తెలుసా ?

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

ప్రపంచంలో అత్యంత ఖరీదు అయిన కార్లు, బైక్ లు  చాలానే ఉన్నాయి. సాధారణంగా  కోట్ల విలువ చేసే వాహనాలు అత్యంత ధనవంతుల గ్యారేజీలో దర్శనమిస్తుంటాయి. ఇది ఏమి అంత పెద్ద విషయం ఏం కాదు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారును కేవలం 10 మంది మాత్రమే కొనుక్కోగలరు. అంత ఖరీదైన కారుకు సంబంధించిన ప్రత్యేకమైన ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును పినిన్ పరీనా అనే కంపెనీ తయారు చేసింది. ఈ కారు ఓ ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.4.4 మిలియన్ యూరోలు. మన భారత కరెన్సీలో 39.8 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదు అయిన ఈ రకం కార్లను పినిన్ పరీనా కంపెనీ కేవలం 10 మాత్రమే తయారు చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు పేరు బి 95 రోడ్ స్టర్ హైర్. ఈ ఎలక్ట్రిక్ కారును ఓ సారి ఫుల్ చార్జింగ్ చేస్తే.. ఏకంగా 450 కిలోమీటర్ల దూరం రోడ్లపై పరుగులు తీస్తుంటుంది. 

Advertisement

ఈ కారుకు 270 కిలో వాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ తో చార్జ్ చేయాలి. కేవలం 25 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. బి95 రోడ్డు స్టర్ హైర్ కేవలం రెండు సెకండ్లలో గంటకు 0 నుంచి 96 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఈ కారు గంటకు 300 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రోడ్లపై పరుగులు తీస్తుంది. మోటార్ 1900 హార్స్ పవర్ అండ్ 2340 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. ఇందులో కాల్మా, పురా, ఎనర్జికా, ప్యూరియోసా అండ్ కరాటేరా అనే 5 డ్రైవింగ్ మోడ్లు పెట్టారు. ఈ కారులో ప్రయాణిస్తున్న ఫీలింగ్ కలుగుతుందని కంపెనీ తెలిపింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

పెళ్లి తేదీ గురించి క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్.. అప్పుడేనా ?

గ్రీన్ టీ ఏ సమయంలో తాగితే మంచిదో తెలుసా ?

Visitors Are Also Reading