తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా కచ్చితంగా వ్యవహరిచే వారిలో నిర్మాత అశ్వనీదత్ ఒకరనే చెప్పాలి. ఈయన బ్యానర్ లో వచ్చే సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. ఆయనకు సినిమా స్టోరీ మీద అంత గ్రిప్ ఉండడమే కారణం. ఏ సినిమా ఎన్ని రోజులు ఆడగలుగుతుందో కూడా ఆయన ముందే చెప్పేస్తారట. అలాంటిది ఎవరైనా స్క్రిప్ట్ బాగున్నప్పుడు అందులో ఎవరైనా వేలు పెడితే మాత్రం అస్సలు ఊరుకోరట.
మంచి సినిమాలు నిర్మించడంలో ఆయనకు సాటి ఎవ్వరూ రారు. సాధారణంగా నిర్మాతలంటే ఎప్పుడూ కోప పడుతూనే ఉంటారు. కొందరు డబ్బులు ఇవ్వరని అంటుంటారు. నస పెడుతుంటారని కొందరూ హీరోయిన్లు చెబుతుంటారు. మరికొందరూ ఫేవర్స్ అడుగుతుంటారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంటుంది. కానీ ఈ రూమర్స్ అన్నింటికి వ్యతిరేకం అశ్వినిదత్. సినిమా ఓకే అయ్యే ముందే ఓ క్లియర్ బడ్జెట్ పెట్టుకుంటారట. అందుకు తగ్గట్టు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తారట. సినిమా స్టోరీని విని ఎన్ని రోజులు ఆడుతుందో పక్కా చెప్పే మనిషి అని ఆయనకు పేరుంది. సినిమా బడ్జెట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటారో క్యారెక్టర్ విషయంలో అంతే కచ్చితంగా ఉంటారు. ఇటీవీల ఆలీతో సరదాగా షోకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాల గురించి వారి బిహేవియర్ గురించి పర్సనల్‌విషయాల గురించి మాట్లాడారు.
అంతేకాదు.. చిరంజీవితో ఆయనకు ఉన్న సంబంధం గురించి కూడా ప్రస్తావించారు. ఇండస్ట్రీ బిగ్ హిట్ మహానటి సినిమా సమయంలో జరిగిన గొడవ గురించి కూడా రీవిల్ చేశారు. నిజానికి మహానటి సినిమాకు తొలుత అనుకున్నది కీర్తి సురేష్ ని కాదు. ఆమె స్థానంలో ఓ మలయాళ ముద్దుగుమ్మను అనుకున్నారట. అయితే ఆమె కూడా ఓకే చెప్పిందట. కానీ సినిమాలో మద్యం తాగే సీన్స్ ఉంటే మాత్రం చేయనని స్ట్రీప్ట్ చేంజ్ చేయమని చెప్పిందట. దీంతో అశ్వినిదత్ కి కోపం వచ్చి ఆమెను సినిమాలోంచి తొలగించారట. స్క్రిప్ట్‌లో మార్పులు చేయమనడానికి ఆమె ఎవ్వరూ అందుకే నేనే సినిమాలో నుంచి తీసేశానుని చెప్పుకొచ్చాడు నిర్మాత అశ్వినదత్.
Also Read : ఇష్టం లేకున్నా బాలయ్య ఎందుకు డిగ్రీ చదివారు…? సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇంత అందంగా ఉందా..?