Home » సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇంత అందంగా ఉందా..?

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇంత అందంగా ఉందా..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైన నటులు చాలామంది ఉన్నారు.. కానీ వారు ఏదో ఒక సమయంలో సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారానో, లేదంటే హీరోయిన్ గా నో మళ్లీ ఎంట్రీ ఇచ్చినప్పుడు వారు చిన్నప్పుడు చేసిన పాత్రలు, వారు ప్రస్తుతం ఉన్న దాన్నిబట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు..

babyvernika

Advertisement

ఈ విధంగా వారి చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి.. అలాగే ఈ చిన్నారి గురించి ఇప్పుడు మనం చూద్దాం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది .

S/o Sathyamurthy Movie Child Artist:

Advertisement

ఈ మూవీలో చిన్నారి వర్ణిక అప్పట్లో చాలా హైలెట్ అయ్యింది.. సన్నాఫ్ సత్యమూర్తి మూవీ లో ఈ చిన్నారి పాప క్యారెక్టర్ కోసం త్రివిక్రమ్ చాలా ఆడిషన్స్ ని చేశారు.. ఈ క్రమంలో అనుకోకుండా తన అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా త్రివిక్రమ్ ఒక చిన్నారి ఫోటో ని చూశారు.. ఆ పాప చాలా క్యూట్ గా కనిపించడంతో త్రివిక్రమ్ ఆ పాప ని తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఇలా సన్నాఫ్ సత్యమూర్తి మూవీ లో చిన్నారి వర్ణికను సెలెక్ట్ చేశారు.. దీంతో పాటు అల్లు అర్జున్ తో ఆమె చేసిన నటన చాలా సెట్ అయిపోయింది.. ఇక ఈమూవీ అప్పట్లో సూపర్ హిట్ అయిన తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ చిన్నప్పటి పాత్రలో చేసి అదరగొట్టింది.

ఈ పాప పెరిగిన తర్వాత సినిమాలు చేయలేదు.. కానీ ఈ మధ్య కాలంలో వర్ణిక కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడం జరిగింది.. ఇందులో వర్ణిక చాలా అందంగా క్యూట్ గా కనిపించింది. దీంతో నెటిజన్స్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమా లో క్యూట్ గా కనిపించిన అమ్మాయిని ఈ విధంగా చూడడంతో ఆశ్చర్యపోతున్నారు.. మరి ఈ వర్ణిక ఇకనైనా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

also read:

Visitors Are Also Reading