Home » తెలంగాణలో రైతులు చేసుకునే ‘ఎలమాస’ పండుగ గురించి మీకు తెలుసా ? 

తెలంగాణలో రైతులు చేసుకునే ‘ఎలమాస’ పండుగ గురించి మీకు తెలుసా ? 

by Anji
Ad

భారతదేశంలో వివిధ మతాల వారు, విభిన్న సంస్కృతుల వారు ఉన్నారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో సంప్రదాయం ఉంటుంది. ఒక్కో ప్రాంతం వారు ఒక్కోవిధంగా ఒక్కో పండుగను జరుపుకుంటారు. కొన్ని పండుగలు వింతగా ఉంటాయి. విశిష్టత కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ కి కూతవేటు దూరంలో అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలుంటాయి. పొరుగు రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలతో పండుగలు చేసుకుంటూ స్థానికులు ప్రత్యేకత చాటుకుంటారు. ప్రకృతి ఒడిలో రైతన్నలు జరుపుకునే పండుగే ఎలమాసం పండుగ. 

Advertisement

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చాలా వెనకబడినటువంటి  ప్రాంతంగా జుక్కల్ ని పేర్కొంటారు. ఇది కామారెడ్డి జిల్లాకు దూరంగా ఉంటుంది. జిల్లా కేంద్రానికి దాదాపు 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఈ ప్రాంతం మూడు రాష్ట్రాల కూడలిగా ఉంటుంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు  ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలు మూడు భాషలు మాట్లాడుతారు. ఎక్కువగా మరాఠి, కర్ణాటక మాట్లాడుతారు. వీరి కట్టు బొట్టు మొత్తం తెలంగాణకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రకృతి పండుగగా ఎలమాస పండుగను జరుపుకుంటారు. జుక్కల్ ప్రాంత రైతులు ఎలమాస పండుగను బంధు, మిత్రులతో కలిసి ఎవ్వరి పొలాల్లో వారు జరుపుకుంటారు. తొలుత జొన్న మొక్కలతో గుడికట్టి, లక్ష్మీమాత, ఎడ్లు, రైతు బొమ్మలను మట్టితో తయారు చేస్తారు.

Advertisement

Manam News

రైతు కుటుంబ సభ్యులతో పొలానికి వెళ్లి పూజలు చేస్తారు. అంబలి కుండకు తాళి బొట్టు కట్టి పాలు పొంగిస్తారు. జొన్న మొక్కలతో కట్టిన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇంటికి తిరిగి వచ్చే సమయంలో హారతి పల్లెంలో దీపం వెలిగించి గ్రామంలోని హనుమాన్ మందిరానికి వచ్చి ప్రత్యేకపూజలు చేస్తారు. పాడి పంటలు బాగుండాలని పంటల దిగుబడి రావాలని ప్రార్థన చేస్తారు. ఈ పండుగ జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడపల్ మండలాలలో నిర్వహిస్తారు. పురాతన కాలం నుంచి ప్రతీ సంవత్సరం ఎలమాస పండుగను జరుపుకుంటున్నట్టు రైతులు పేర్కొంటున్నారు. తాతల కాలం నుంచి ఎలమాస పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పిలుచుకొని పూజలు చేసి.. అక్కడే వనభోజనం చేయడం ఆనవాయితిగా వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. 

Also Read :   Balli Sastram in Telugu: మన శరీరంలో ఏయే భాగాలలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయో మీకు తెలుసా..?

Visitors Are Also Reading