సాధారణంగా చాలా మంది పని ఒత్తిడి కారణంగా ఎక్కువగా నిద్ర పోరు. బిజీలైఫ్‌లో గడిపేస్తుంటారు. అర్థరాత్రి వరకు బిజీబిజీగా ఉండడంతో పాటు పడుకున్నాక అతిగా ఆలోచించడం లేదా మరే ఇతర కారణం వల్లనైనా కొంత మందికి సరిగ్గా నిద్ర పట్టదు. ఆరోగ్యంగా ఉండడానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. పెద్దలు అయితే ఉద్యోగం.. పనులు, పిల్లలు అయితే పాఠశాలలు, కళాశాలలో నిద్ర పోతుంటారు. ఇలా జరగడానికి ముఖ్య కారణం రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడమే. తొందరగా నిద్ర రావాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
చాలా మంది రాత్రి భోజనానికి ముందు మద్యం సేవించడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. గాఢమైన నిద్ర కావాలంటే.. రాత్రి సమయంలో మద్యానికి దూరంగా ఉండాలి. చాలా మంది వ్యాయామం చేస్తే అలిసిపోయి బాగా నిద్రపడుతుందని భావిస్తుంటారు. కానీ అలా చేయడం ద్వారా శరీరంలో ఉన్న నరాలు యాక్టివ్ అవుతాయి. నిద్ర కోసం చాలా సమయం ఎదురు చూడాల్సి వస్తుంది.
Advertisement
అదేవిధంగా కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు రాత్రి పూట సాధ్యం అయినంత వరకు దూరంగా ఉండండి. కాఫీలకు అలవాటు పడి ఉంటారు. మోతాదుకు మించితే నిద్రకు ప్రమాదమే. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా ప్రశాంతమైన నిద్రకు కూడా ప్రమాదమే. కొవ్వు ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం బెటర్. అదేవిధంగా మొబైల్ మీద ఉండే బ్లూ లైన్ అనేది కళ్లకు చాలా హాని చేస్తుంది.
చీకటిలో దీనిని వినియోగించడం వల్ల కళ్లపై ఎఫెక్ట్ చూపించి.. నిద్రను దూరం చేస్తోంది. అల్లం, తులసి, కుంకుమ పువ్వు వంటి పదార్థాలతో టీ తయారు చేసుకోండి. తగినంతగా తేనే కలిసి ఆ టీని రోజుకు ఒకసారి తాగండి. ఈ టీలోని ప్రతి పదార్థం చక్కని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ టీ తాగడం వల్ల నిద్రతో పాటు డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. ఈ చిట్కాను పాటించండి.
Also Read :
మీ కంటికి ఓ పరీక్ష.. ఈ ఫోటోలో ఉన్నది కనిపెడితే మీరు గ్రేట్..!
ఇండియన్ సినిమా అనేది ఒక మతం… రాజమౌళి దానికి పీఠాధిపతి : మెగాస్టార్