మామూలుగా ఇంట్లో వండిన అన్న మిగిలినట్టయితే మరుసటి రోజు తినడం మనకు అలవాటు. ఇక ఈ అలవాటు అనేది ఎక్కడికి దారి తీస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిగిలిపోయిన అన్నం తినడం ఆరోగ్యానికి హానికరమని అనేక పరిశోధనల్లో వెల్లడి అయింది. ఇక నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లండ్ ఆధారంగా ఇండిపెండెంట్ ఇచ్చిన నివేదికలో మిగిలిపోయిన అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి : భోజనం చేసిన తరువాత మధ్యాహ్నం నిద్రపోతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే..!
Advertisement
ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మరుసటి రోజు మిగిలిపోయిన అన్నం తినకూడదు. ఈ నివేదిక ప్రకారం.. మిగిలిపోయిన అన్నం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్‌కి గురయ్యే అవకాశముంది. అన్నం ఉడికిన తరువాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచి తినడం వల్ల అందులోకి బ్యాక్టిరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించగానే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకే బియ్యాన్ని ఎక్కువ సేపు ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచకుండా చూడాలి. అన్నం వండిన గంట లేదా రెండు గంటల్లోపు తినాలి. అన్నం వండేటప్పుడు దానిని బాగా ఉడికించాలి. అదేవిధంగా గది ఉష్ణోగ్రతలో అధిక సమయం ఉంచకుండా ఫ్రిజ్‌లో ఉంచండి. ఫ్రిజ్‌లో ఉంచితే కొన్ని గంటల తరువాత కూడా వాడుకోవచ్చు.
Advertisement
ఇది కూడా చదవండి : లైగర్ సహా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలిలే…ఎన్ని హిట్ ఎన్ని ఫట్టో తెలుసా..?
అన్నం వండేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. ముఖ్యంగా మనం రోజూ ఎంత తింటాం. ఎంత మంది ఉన్నారని ఓ లెక్క వేసుకొని మిగలకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ తక్కువ అయినట్టయితే అప్పటికప్పుడు వేడివేడిగా వండుకోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా అన్నం వేడి చేసి తినాలనిపిస్తే కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే వేడి చేయాలి. అన్నం మళ్లీ మళ్లీ వేడి చేసి మాత్రం అస్సలు తినకూడదు. అలా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. కాబట్టి మిగిలిన అన్నం తిని ఇబ్బంది పడేకన్నా అసలు అన్నం మిగలకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే చాలా బెటర్.
ఇది కూడా చదవండి : భారతీయుడు మూవీ కథలో ఇది గమనించారా.. పెట్టిన బడ్జెట్ కన్నా ఇన్ని రేట్లు వసూలు చేసిందా..?