Home » ఛీ ఛీ క్యాంటిన్ లో కూడా అలాంటి పనులా ? నోటీసు బోర్డు పెట్టిన యాజమాన్యం..! 

ఛీ ఛీ క్యాంటిన్ లో కూడా అలాంటి పనులా ? నోటీసు బోర్డు పెట్టిన యాజమాన్యం..! 

by Anji
Ad

సాధారణంగా క్యాంటిన్ లో భోజనం చేసిన తరువాత  తిన్న ప్లేట్లు, నీరు తాగిన గ్లాస్ లు, చెంచాలు అక్కడే పెడుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో  వాటిని క్యాంటిన్ నిర్వాహకులు మాత్రమే  తీస్తుంటారు. మరికొన్ని  ప్రాంతాల్లో మనమే తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పడేస్తుంటాం. ఆ సందర్భంలో  కొంత మంది వాటిని కూడా గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్తుంటారు. ఇలాంటి ఘటనలు ముంబయిలోని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న క్యాంటిన్ వద్ద తరుచూ జరుగుతున్నాయి.

Also Read :   భర్త ఇంట్లో లేని సమయంలో…. భార్యలు చేయకూడని తప్పులు ఇవే!

Advertisement

 సిద్ధివినాయక్ క్యాటరర్స్ పేరుతో అక్కడ ఓ క్యాంటిన్ ను నిర్వహిస్తున్నారు. ఆ క్యాంటిన్ కి బీఎంసీలో పని చేసే ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా వచ్చి ప్రతిరోజూ టిఫిన్లు, భోజనాలు చేస్తుంటారు.   అలా అక్కడికి వచ్చిన వారు తిన్న తరువాత అక్కడ ఉన్నటువంటి చెంచాలను, టిఫిన్ ప్లేట్లను, గ్లాస్ లను బ్యాగ్ లో గుట్టు చప్పుడు కాకుండా బ్యాగ్ లో వేసుకొని వెళ్లిపోతున్నారట. రోజు రోజుకు ప్లేట్లు, గ్లాస్ లు తక్కువవుతున్నాయని క్యాంటిన్ నిర్వాహకులు గమనించారు.  

Advertisement

Also Read :  ‘నా జీవితంలోనూ బ్రేకప్’.. సాయి ధరమ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..!

Manam News

అలా గమనించిన తరువాత క్యాంటిన్ పరిసరాల్లో మాత్రమే తినాలని సూచించారు. దయచేసి బయటికి తీసుకెళ్లకూడదని క్యాంటిన్ యజమాన్యం వినియోగదారులను కోరుతూ ఓ నోటీస్ బోర్డు ఏర్పాటు చేసింది. క్యాంటిన్ లోని వస్తువులను ఖాతాదారులు బయటికి తీసుకెళ్లిపోతున్నట్టు మా దృష్టికి వచ్చింది. చెంచాలు, ప్లేట్లు, గ్లాసులు కొన్ని కనిపంచడం లేదు. దీంతో మిగతా ఖాతాదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆ నోటీసు బోర్డులో పేర్కొంది. ఇక్కడ ఉన్నటువంటి  వస్తువులను ఎవ్వరూ కూడా బయటికి తీసుకెళ్లొద్దన వెల్లడించారు. ఇప్పటివరకు 6వేలకు పైగా చెంచాలు, 400 ప్లేట్లు, 100 కి పైగా గ్లాస్ లు పోయామని పేర్కొంది. 

Also Read :  Airtel యాడ్ అమ్మాయి మీకు గుర్తుందా ? ప్రభాస్ సినిమా తరువాత సైలెంట్..!

Visitors Are Also Reading