Home » మీ దంతాలు మెరిసిపోవాలని గట్టిగా తోముతున్నారా..? అయితే సమస్యలు తప్పవు జాగ్రత్త ..!

మీ దంతాలు మెరిసిపోవాలని గట్టిగా తోముతున్నారా..? అయితే సమస్యలు తప్పవు జాగ్రత్త ..!

by Anji
Ad

ఉదయం నిద్ర లేవగానే మనం చేసే మొదటి పని బ్రష్ చేసుకోవడమే. నోరు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రష్ పై పేస్ట్ వేసుకొని పళ్లను రుద్ధడం వల్ల అవి మెరిసిపోతాయని  చాలా మంది అనుకుంటారు. కానీ అలా రుద్దడం వల్ల దంతసమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రష్ తో కూడిన పళ్లను గట్టిగా రుద్దుకోవడం వల్ల పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. పళ్లను గట్టిగా తోమడం వల్ల ఎనామిల్ పొర మాత్రమే కాదు.. అతి జాగ్రత్త, అపోహలు ముప్పు తెచ్చిపెడుతాయని చెబుతున్నారు. 

Advertisement

రోజుకొకసారి పళ్లు తోముకుంటే సరిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ కొంత మంది ఉదయం, సాయంత్రం రెండు సార్లు బ్రష్ చేస్తుంటారు. వాస్తవానికి రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తేనే మంచిది. ముఖ్యంగా బ్రష్ కి ఉండే గరుకు అయిన బ్రిజిల్స్ వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోతుంది. అలాగా అని మృదువైన బ్రిజిల్స్ ఉండే బ్రష్ అస్సలు ఉపయోగించకూడదు. మీడియం ట్రూత్ బ్రష్ ని ఎంచుకోవడం ఉత్తమం. పళ్ల సందుల్లో ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బ్రష్ చేసుకున్న తరువాత మౌత్ వాష్ తో పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుందని.. పళ్ల మధ్య ఉండిపోయిన ఆహార పదార్థాలను తొలగించుకోవచ్చు. అలాగా అని బ్రషింగ్ కి బదులుగా మౌత్ వాష్ తో పుక్కిలించడం సరైన పద్దతి కాదు. మౌత్ వాష్ ని ఎంత వాడాలి..? ఎలా వాడాలి అనేది తెలుసుకోవడం ఉత్తమం. 

Advertisement

Also Read :  ఈ 3లక్షణాలున్న అబ్బాయిల్ని అమ్మాయిలు చచ్చేంత ఇష్టపడతారు..మీలో ఉన్నాయా..?

Manam News

చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. చాాలా మంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. సమస్య ముదిరిన తరువాత బాధపడడం కన్నా ముందుగానే జాగ్రత్త పడాలి. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ కనీసం ఆరు నెలలకు ఒకసారైనా డెంటిస్ట్ ని సంప్రదించాలి. వారు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి. దంతాలను శుభ్రం చేయించుకుంటే వాటిపై పేరుకుపోయిన పాచి తొలగిపోయి అవి మరింత శుభ్రపడుతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

Also Read :   రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే ఆహార పదార్థాలు ఇవే..!

Visitors Are Also Reading