Home » రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే ఆహార పదార్థాలు ఇవే..!

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే ఆహార పదార్థాలు ఇవే..!

by Anji
Ad

శరీర రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవాలనుకుంటే..  ఐరన్ సంబంధిత సంప్లిమెంట్స్, ఐరన్ స్థాయిలను ఎక్కువగా కలిగి ఉన్న ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. ఐరన్ స్థాయిలు తక్కువగా కలిగి ఉన్న ఆహారాలు, పోషకాహార లోపం కలిగిన వారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గే అవకాశముంది. ఎక్కువ స్రావాలకు గురయ్యే స్త్రీలలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతుంటాయి. రక్త స్రావం ఎక్కువవ్వడానికి ప్రధానకారణం ఐరన్ లోపం.. దీని ఫలితంగా హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

రెడ్ మీట్ 

manam News

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుకోవాలనుకుంటే  మాత్రం ఐరన్ ని ఎక్కువగా కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. రెడ్ మీట్ అధికంగా ఐరన్ ని కలిగి ఉంటుంది. ఈ ఐరన్ పేగులచే వేగంగా గ్రహించబడుతుంది. వాస్తవానికి ఐరన్ ని అధిక మొత్తంలో కలిగి ఉన్న రెడ్ మీట్ ని ఎక్కువగా తినడం వల్ల గుండెపోటు వంటివి కలుగుతాయి. అంతేకాదు.. దీనిలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలు అధిక మొత్తంలో ఉంటాయి. వ్యాధులకు గురవ్వకుండా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవడానికి తినే ఆహారంలో సమతుల్య స్థాయిలో రెడ్ మీట్ ని తీసుకోవాలి. 

కూరగాయలు 

Vegetable

అన్ని రకాల పచ్చని ఆకుకూరలు, కొన్ని రకాల కూరగాయలు ఐరన్ కలిగి ఉంటాయి. బీట్ రూట్, టొమాటోలు, పాలకూర, గ్రీన్ పీస్, రాజ్మా, క్యాబేజీ, టర్నిప్, చిలగడదుంప, క్యాప్సికం, మిరియాలు, గుమ్మడికాయ, కాలీ ఫ్లవర్ వంటి కూరగాయల్లో ఐరన్ ఉంటుంది. వీటిలో పాటు బ్రోకలీ, లిమా బీన్స్, నల్లని బీన్స్ వంటి కూరగాయలు తగిన స్థాయిలో ఐరన్ ఉంటుంది. రక్తం స్థాయిలు పెంచుకోవడానికి బీట్ రూట్ మంచి మార్గం అని చెప్పవచ్చు. ఎర్ర రక్తకణాలను చైతన్య పరిచి రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది.  

Advertisement

Also Read :  ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ లో తనను తానే పందెం కాసింది.. చివరికీ ఏమైందంటే ?

పండ్లు 

Manam News

 

తాజాగా పండ్లు, డ్రై ప్రూట్స్ వల్ల రక్త పరిమాణం పెరుగుతుంది. రక్తంలో చైతన్యవంతమైన ఎర్రరక్తకణాల స్థాయిలను పెంచుకోవడానికి అధిక మొత్తంలో డ్రై ప్రూట్, ప్రూనే, డ్రైఫిగ్స్, ఆఫ్రికాట్లు, జామపండ్లు, స్ట్రాబెర్రీలు, బొప్పాయి, ఆపిల్, ద్రాక్ష, పుచ్చకాయలను అధికంగా తినండి.  అంతేకాదు.. ఆరేంజ్, ఉసిరి, నిమ్మ, ద్రాక్ష, వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను ఐరన్ ఉప భాగాలను తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.  

Also Read :   అతిపిన్న వయసులోనే ఫిఫాలో 9 గోల్స్.. పీలే రికార్డును బ్రేక్ చేసిన ఆటగాడు ఎవరంటే? 

నట్స్ 

Manam News

సాధారణంగా ఎవరికైనా ప్రతిరోజూ నట్స్ తినడానికి ఇష్టం ఉండదు. కానీ నట్స్ అధిక మొత్తంలో ఐరన్ ని కలిగి ఉంటాయి. పలు రకాల నట్స్ లో కన్నా బాదం పప్పులో అధిక శాతం ఐరన్ ఉంటుంది. రోజు పిడికెడు బాదం పప్పులను తినడం ద్వారా 6 శాతాన్ని ఐరన్ శరీరానికి అందుతుంది. ఆస్తమా ఉన్న వారు మాత్రం నట్స్ లలో వేరు శనగను తినకండి.  

Also Read :   ఉదయం నిద్ర లేవడానికి, రాత్రి నిద్రించడానికి బెస్ట్ సమయం ఏదో తెలుసా ?

Visitors Are Also Reading