స్టార్ హీరో దుల్కర్ సల్మాన్-మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అగ్ర నిర్మాత ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం సీతారామం. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనా లే నెలకొన్నాయి. ఆగస్టు 05న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఫ్రీ రీలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరు అయ్యాడు. సీతారామం సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు.. ఈ చిత్ర ట్రైలర్ ఎవరు కట్ చేశారో కానీ అద్భుతంగా ఉంది అన్నారు. కొన్ని సినిమాలు థియేటర్లలో చూడాలన్నారు. సీతారామం సినిమా అలాంటిదే అని.. అందుకే సినిమాని థియేటర్ లోనే చూడాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు ప్రభాస్. ఇంట్లో పూజ గది ఉంది అని గుడికి వెళ్లడం మానేస్తామా..? అని ప్రభాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Advertisement
Advertisement
మాకు థియేటర్స్ గుడి లాంటివి అన్నారు డార్లింగ్. తప్పకుండా ఈ సినిమాని థియేటర్ లో చూడాలని పిలుపునిచ్చారు. దుల్కర్ మోస్ట్ హాండ్సమ్ హీరో అని.. సూపర్ స్టార్ ఇన్ ది కంట్రీ.. తెలుగులో మీరు చేసిన మహానటి గ్రేట్ ఫిల్మ్.. ఒక లవ్‌స్టోరీని ఇంత ఫ్యాషన్ గా ఖర్చు పెట్టి యుద్ధాన్ని కూడా చూపించారు. కాశ్మీర్‌లో యుద్ధ సన్నివేశాలు తీసి.. కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదని తెలుస్తోంది. అంతకు ముందు స్టేజ్ పై వచ్చిన ప్రభాస్ సీతారామం నిర్మాత అశ్వనిదత్ కూతురు స్వప్న దత్ స్టేజ్ పైకి రావాలంటూ పట్టుబట్టారు. ఆమె వస్తేనే నేను మాట్లాడుతానన్నారు. స్వప్న స్టేజ్ పైకి వచ్చి ప్రభాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభాస్ ను రమ్మని చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్పారు. సాధారణంగా ప్రభాస్ బయటికి రాడు.. అలాంటిది తన కోసం వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు స్వప్న. ఆగస్టు 05న విడుదలయ్యే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.
Also Read :
సాలార్ లో రాధేశ్యామ్ సీన్ రిపీట్…?
కోడి రామకృష్ణ-బాలకృష్ణ కాంబినేషన్‌లో ప్రారంభమై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా..?