Home » సాలార్ లో రాధేశ్యామ్ సీన్ రిపీట్…?

సాలార్ లో రాధేశ్యామ్ సీన్ రిపీట్…?

by Azhar
Ad

బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే తీస్తున్నాడు. ఆ సినిమాతో ఊహించని రీతిలో క్రేజ్ అనేది తెచుకున్న ఈ రెబల్ స్టార్ ఇప్పుడు చేస్తున్న ప్రతి సినిమాపై అభిమానులకు చాలా అంచనాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ బాహుబలి తర్వాత ఇప్పటికే సాహో, రాధే శ్యామ్ అనే సినిమాలు విడుదల చేసాడు. అందులో సాహో ఒక్కటే పర్లేదు అనిపించుకున్నా.. రాధే శ్యామ్ మొత్తం డిజాస్టర్ అయ్యింది.

Advertisement

అయితే ఈ రాధే శ్యామ్ సినిమా అనేది విడుదలకు చాలా సమయం తీసుకుంది. ఇక ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు రెండోసారి షూట్ చేసారు. అలా చేయడం వల్ల డబ్బు అలాగే సమయం అనేది వృధా అయ్యింది. ఇక ఇంత చేసినా కూడా ఈ సినిమా అనేది హిట్ కాలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న మరో సినిమా సాలార్ విషయలో కూడా ఇదే సీన్ అనేది రిపీట్ అవుతుంది అని తెలుస్తుంది.

Advertisement

కేజిఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సాలార్ సినిమా తెరక్కేకుతుంది. ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ అనేవి కేజిఎఫ్ 2 కంటే ముందే తీశారు. కానీ కేజిఎఫ్ 2 భారీ హిట్ అయ్యి.. ప్రశాంత్ పై అంచనాలు పెరగడంతో అందుకు తగ్గిన విధంగా మళ్ళీ ఈ యాక్షన్ సీన్స్ లో మార్పులు అనేవి చేసి రీ షూట్ చేయాలనీ డైరెక్టర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రభాస్ కూడా అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

9 ఏళ్ళ తర్వాత అమ్మను కలిసిన ముంబై ఆటగాడు..!

ఇక మౌకా మౌకా యాడ్‌ కనిపించదట..!

Visitors Are Also Reading