Telugu News » Blog » శుక్రవారం ఈ పువ్వుతో లక్ష్మీ దేవిని పూజిస్తే ఇంట్లో డబ్బులకు లోటు ఉండదట…ఎలా పూజించాలంటే..?

శుక్రవారం ఈ పువ్వుతో లక్ష్మీ దేవిని పూజిస్తే ఇంట్లో డబ్బులకు లోటు ఉండదట…ఎలా పూజించాలంటే..?

by AJAY
Ads

ఇంట్లో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యంతో పాటు సంపాదన కూడా ఉండాల్సిందే. అయితే కొన్నిసార్లు కుటుంబంలో ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. అలా జరగకుండా ఆర్థిక సమస్యలు దూరం అవ్వాలంటే లక్ష్మీదేవిని తరచూ పూజించాలి. అంతేకాకుండా లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వుతో పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి.

Advertisement

 

లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు తామర పువ్వును దేవి పాదాల వద్ద ఉంచాలి… అంతేకాకుండా శుక్రవారం నాడు ఈ పూజ చేస్తే మంచి జరుగుతుంది. అదేవిధంగా తామర పువ్వును ఏకాదశి నాడు శ్రీకృష్ణుడి వద్ద ఉంచితే సంతానం కలుగుతుందట. సంవత్సరానికి 24 ఏకాదశిలు వస్తాయి. కాగా సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి తామర పువ్వులను శ్రీకృష్ణుడికి సమర్పించాలి.

Advertisement

 

money

money

అంతే కాకుండా కొన్ని కుటుంబాల్లో సంపాదన ఉన్నప్పటికీ గొడవలు మనస్పర్ధలు వస్తుంటాయి. అయితే అలాంటివారు బుధవారం తామర పువ్వుకు చందనం రాసి దానిని లక్ష్మీదేవి మరియు గణేశుని పాదాల వద్ద ఉంచాలట. వీటితో పాటు అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఏడాది పాటు ఇంట్లో ఒక వారం పాటు శివలింగంపై తామర పువ్వును పెట్టి పూజించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.