Home » కట్ చేసిన పండ్లు రంగు మారకుండా ఉండాలంటే.. ఇలా చేయండి…!

కట్ చేసిన పండ్లు రంగు మారకుండా ఉండాలంటే.. ఇలా చేయండి…!

by Sravya
Ad

మనం పండ్లు కట్ చేసి పక్కన పెడితే అవి రంగు మారిపోతూ ఉంటాయి. కొంచెం సేపు తర్వాత తినాలని అస్సలు అనిపించదు. అలానే కొంతమంది పేరెంట్స్ పిల్లలకి లంచ్ బాక్స్ లో పండ్లు కట్ చేసి పెడుతూ ఉంటారు. ఆఫీస్ కి కూడా కొంతమంది స్నాక్స్ గా ఫ్రూట్స్ ని తీసుకు వెళ్తూ ఉంటారు. కానీ అవి తినటానికి ఫ్రెష్ గా కనపడవు. రంగు మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఆపిల్, జామ, పియర్స్ వంటి పండ్లు తరిగిన కాసేపటికి రంగు మారిపోతూ ఉంటాయి రుచి కూడా మారిపోతుంది. అయితే ఇలా రంగు మారిపోకుండా రుచి మారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్స్ కి గాలి తగిలినప్పుడు గాలిలోని మాయిశ్చరైజర్ రంగుని మార్చేస్తుంది. తరిగిన వెంటనే పండ్లు ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తాయి.

Advertisement

Advertisement

ఆ రియాక్షన్ కారణంగా రంగు మారుతుంది పండ్లు. తరిగాక చల్లటి నీళ్లలో 30 సెకండ్లు ముంచేసి తర్వాత ప్యాక్ చేసుకోవడం మంచిది. అలా చేయడం వలన ఎన్ని గంటలైనా రంగు మారదు. ఒక గిన్నెలో సగానికి పైగా చన్నీళ్లు పోసి అరటి స్పూన్ సాల్ట్ వేసి రెండు మూడు నిమిషాల పాటు పండ్ల ముక్కలను ఉంచితే ఫ్రెష్ గా ఉంటాయి. కాసేపు చన్నీటిలో ఉంచి అల్లం జ్యూస్ వేస్తే కూడా ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి. పండ్ల ముక్కల్ని స్టోర్ చేయడానికి ముందు తేనె కలిపిన గోరువెచ్చని నీళ్లలో ఉంచి ప్యాక్ చేసుకుంటే కూడా పండ్లు ముక్కలు నల్లగా మారిపోవు. తేనె బాగా పట్టించి ముక్కలని డబ్బాలో పెట్టుకుంటే కూడా ఎక్కువసేపు పాడవకుండా ఉంటాయి.

Also read:

Visitors Are Also Reading