సాధారణంగా మనం ఉదయం నిద్రలేవగానే టీ, కాపీ తాగే అలవాటు ఉంటుంది. చాలా వరకు వైద్యులు ఉదయం అల్పాహారం తీసుకోకపోతే హెల్త్ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఉదయం వేళలో వేయించిన ఆహారంతో రోజును ప్రారంభిస్తే అది జీర్ణక్రియ సమస్యలను తీసుకొస్తుంది. అదేవిధంగా బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఏయే ఆహార పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
టీ లేదా కాఫీ :
పరిగడుపున టీ లేదా కాఫీని మాత్రం అస్సలు తాగకండి. మీరు టీ లేదా కాఫీ ఏదైనా తాగాలనుకుంటే అందులో బ్రెడ్ లేదా బిస్కేట్లు తినాలి. లేకపోతే మీ జీర్ణక్రియకి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగకపోవడం బెటర్.
సలాడ్ :
చాలా మంది ఫిట్ నెస్ కారణంగా ఉదయం ఖాలీ కడుపుతో సలాడ్ తినడం ప్రారంభిస్తారు. కానీ సలాడ్ తినడానికి మధ్యాహ్న సమయం చాలా ఉత్తమం. పొరపాటున కూడా పరిగడుపున సలాడ్ అస్సలు తీసుకోకండి. అలా చేయడం వల్ల భవిష్యత్ లో మీరు ఇబ్బందులు ఎదుర్కుంటారు.
Advertisement
ఉదయం ఖాలీ కడుపుతో యాపిల్ తింటే మీకు హాని కలుగుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును.. ఎందుకంటే ఆపిల్ జీర్ణం కావడానికి 1 లేదా 2 గంటల సమయం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ తింటే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
Also Read : ఈ అబ్బాయికి శరీరం మొత్తం వెంట్రుకలే.. వైద్యులు ఏమంటున్నారంటే ?
లస్సీ :
చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో లస్సీని తాగడానికి ఇష్టపడుతుంటారు. ఇలా చేయడం ద్వారా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో లస్సీ తాగడం మీ ఆరోగ్యానికి హానికరం. అందుకే ఉదయం పూట వీటిని తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం బెటర్.