కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఓ ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. ఆధార్ కార్డుకు సంబంధించిన ఎటువంటి జిరాక్స్ కాపీలను కానీ ఎవరికీ కూడా ఇవ్వవద్దని ప్రజలను కోరింది. ఆ విధంగా ఇచ్చిన జిరాక్స్ కాపీలతో దుర్వినియోగం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉన్నదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సూచించింది.
Advertisement
ఆధార్‌ను జారీ చేసే యూఐడీఏఐ లైసెన్స్ ఉన్న సంస్థలు మాత్రమే. వివిధ వ్యక్తుల సమాచారం పొందడానికి వాడుకోవచ్చు. లైసెన్స్ లేని హోటళ్లు, సినిమాహాళ్లు, ఇతర ప్రయివేటు వ్యక్తులు ఆధార్ కార్డుల జిరాక్స్‌ను అసలు తీసుకోకూడదు. ఒకవేళ కాదు అని తీసుకుంటే ఆధార్ చట్టం 2016 ప్రకారం అది నేరం కింద పరిగణలోకి తీసుకుంటారు. ఏ పసంస్థ అయినా ఆధార్ కోసం డిమాండ్ చేస్తే.. సదరు వ్యక్తుల యూఐడీఏఐ నుంచి లైసెన్స్ ఉన్నదో లేదో చెక్ చేసుకోవాలి. అంతగా కావాలని పట్టుబడితే యూఐడీఏఊఐ వెబ్ నుంచి చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే మాస్క్‌డ్ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలని వెల్లడించింది.
Advertisement
ప్రస్తుతం మార్కెట్ లో కొత్త సిమ్ కార్డు కొనాలన్నా ఏదైనా జాబ్‌కు ఇంటర్వ్యూకు వెళ్లినా బ్యాంకుకు వెళ్లి కొత్త ఖాతా తెరవాలన్నా.. పింఛన్ కావాలన్నా.. రేషన్ బియ్యం రావాలన్నా ఆధార్ కార్డు జిరాక్స్ తప్పకుండా ఇవ్వాల్సిందే. ఈ తరుణంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వివిధ కారణాలు చూపి వ్యక్తుల ఆధార్ కార్డులతో లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాల నుండి డబ్బులతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్‌కి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఎవ్వరికీ పడితే వారికి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను అస్సలు ఇవ్వకూడదని కోరింది.
Also Read :
25 ఏళ్లుగా హీరో వెంకటేష్ రోజా మధ్య మాటలు లేకపోవడానకి కారణం అదేనా..?
తారకరత్న భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తుందంటే…!