Telugu News » Blog » తారకరత్న భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తుందంటే…!

తారకరత్న భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తుందంటే…!

by AJAY
Published: Last Updated on
Ads

నందమూరి ఫ్యామిలీ నుండి టాలీవుడ్ కు పరిచయం అయిన హీరో తారకరత్న. ఒకటో నంబర్ కుర్రోడు సినిమా తో తారకరత్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చూడ్డానికి పొడవుగా సన్నగా ఉన్న ఈ నందమూరి కుర్రాడిని చూసి స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు. కానీ ఈ సినిమా తరవాత తారకరత్న వరుస ఫ్లాపులతో సతమతవుతున్నాడు. 20 కి పైగా సినిమాల్లో నటించినా కూడా ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ హిట్ పడలేదు.

 

ఇక అమరావతి సినిమాలో తారకరత్న విలన్ గా నటించాడు. ఈ సినిమాలో అద్భుతంగా నటించి నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ ఆ తరవాత కూడా తారకరత్న కి పెద్దగా ఆఫర్ లు వచ్చింది లేదు. ఇదిలా ఉంటే త్వరలో మహేష్ బాబు సినిమాలో తారకరత్న కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో తారకరత్న పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అతడి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కూడా నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. తారకరత్న సినీ ఫక్కీలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రాణం గా ప్రేమించిన తారకరత్న కుటుంబ సభ్యులు నో చెప్పడం తో సంగి టెంపుల్ లో వివాహం చేసుకున్నాడు. అలేఖ్య రెడ్డి కి అప్పటికే పెళ్లి జరిగి విడాకులు అయినట్టు తెలుస్తోంది. తారకరత్న కాలేజీల చదువుకునే రోజుల్లో అతడికి ఓ జూనియర్ ఉండేది. ఆ జూనియర్ వాళ్ల అక్క అయిన అలేఖ్య రెడ్డి తో తారకరత్న కు పరిచయం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి: 25 ఏళ్లుగా హీరో వెంక‌టేష్ రోజా మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డాన‌కి కార‌ణం అదేనా..?

ఆ పరిచయం కొంత కాలానికి ప్రేమగా మారింది. అంతే కాకుండా తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు సినిమా కు అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. అలేఖ్య రెడ్డి రావాణా శాఖలో పనిచేయగా వీరి స్వగ్రామం అనంతపురం జిల్లాలో ఉంది. ఇక అలేఖ్య రెడ్డి తారకరత్న లకు ప్రస్తుతం ఓ పాప ఉంది. ఎక్కడకు వెళ్ళినా ఈ జంట చక్కగా కలిసి వెళతారు. అంతే కాకుండా మొదట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఫ్యామిలీ దూరం పెట్టినా ఇప్పుడు అంతా కలిసి హ్యాపీగా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి: షో ఆఫ్ అవ‌స‌ర‌మా..? మంచు ల‌క్ష్మి పోస్ట్ పై నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!


You may also like