పిల్లలు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలకి ఏది పడితే అది పెట్టడం వలన ఆరోగ్యం పాడవుతుంది. పిల్లలు ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం తల్లిదండ్రులు కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. పిల్లలకి ఇటువంటి ఆహార పదార్థాలని పెడితే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. రంగు రంగులు వేసిన ఆహార పదార్థాలని వాళ్ళకి పెట్టకండి. ఇటువంటి ఆహార పదార్థాల వలన ఆందోళన, తలనొప్పి, హైపర్ ఆక్టివిటీ వంటివి కలుగుతాయి.
Advertisement
Advertisement
ఆర్టిఫిషియల్ కలర్స్ కి దూరంగా ఉంచాలి. కెఫిన్ ఉండే ఆహార పదార్థాలను కూడా పిల్లలకి ఇవ్వకూడదు. అదే విధంగా పిల్లలకి ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను పెట్టకండి. ఫ్రై చేసిన ఆహార పదార్థాలని, ప్యాకేజీ స్నాక్స్ ని పెట్టకండి. వీటిలో కొవ్వు పదార్థాలు ఉంటాయి. షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా పిల్లలకి పెట్టకండి వీటివలన పిల్లల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది. స్వీట్లు, ఐస్క్రీమ్లు వంటి వాటిలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లలకి మంచి పోషకాహారాన్ని ఇవ్వండి. కూరగాయలు, పండ్లు, పప్పులు, నట్స్ వంటి వాటిని వాళ్ళకి పెడుతూ ఉండండి. మార్చి మార్చి ఆహార పదార్థాలను ఇస్తూ ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడుతుంటారు.
Also read:
- గుమ్మడి గింజలతో ఒత్తైన జుట్టు… ఇలా చేస్తే చాలు.. అస్సలు జుట్టే రాలదు..!
- ఎన్టీఆర్ ఆ విషయంపై స్పందించే అవకాశమే లేదట.. కారణం ఏంటంటే..?
- ప్రధాని మోడీ చాలా ఇష్టంగా తినే ఈ పరోటాతో మధుమేహం, రక్తపోటు మటుమాయం..!