వంట గదిలో పని చేయడం అనేది ప్రతి ఒక్క మహిళకు ఇది ఆనవాయితి. కొన్నిసార్లు పని ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు త్వరగా చేయాలనే ఆలోచనతో చేతులు కాల్చుకోవడం వంటివి జరుగుతుంటాయి. చర్మం కాలడం వంటివి తరచుగా జరుగుతూనే ఉంటాయి. దీంతో ఎంతో మంది చికాకు పడుతూ ఉంటారు. ఇక ఇదే సమస్య కేవలం మహిళల్లోనే కాకుండా పురుషుల్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ కాలిన చోట మంట నొప్పి భరించలేనంతగా ఉంటుంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది టూత్ పేస్ట్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. వీటివల్ల ఎన్నో దుష్ప్రభావాలు కూడా వస్తాయి. వాటి గురించి చూద్దాం.
Advertisement
1. కాలిన చోట మంట రాకుండా ఉండాలంటే చర్మంపై మంచు ముక్కతో రుద్దడం మంచిది. ఇది చికాకు నుంచి కూడా బయటపడే విధంగా చేస్తుంది. ఇలా మంచు ముక్కతో రుద్దడం వల్ల చర్మంపై కాలిన భాగాన చల్లబడుతుంది.
Advertisement
2. మరొక విషయం ఏమిటంటే.. కాలిన చోట టూత్ పేస్ట్ రాయడం వల్ల కాస్త చల్లబరుస్తుంది. కానీ టూత్‌పేస్ట్ చర్మ రంద్రాలను నిరోధిస్తుంది. దీనివల్ల మంట తొందరగా తగ్గదు.
3. ఒకవేళ కాలిన తరువాత చర్మంపై బొబ్బలు లేదా పొక్కులు వచ్చినట్టయితే ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని పగులగొట్టకుండా కేవలం డ్రెస్సింగ్ చేయడం మంచిదని వైద్యులు తెలియజేస్తున్నారు.
4. కాలిన చోట సూర్యరశ్మి కిరణాలు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఇలా చేసినట్టయితే సూర్యుని నుంచి వెలువడే కొన్ని హానికరమైన కిరణాల వల్ల కాలిన చోట కాస్త చికాకుగా అనిపిస్తుంది. దీనివల్ల చర్మంపై పొక్కులు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండలోకి వెళ్లేటప్పుడు చర్మాన్ని కవర్ చేసుకునే విధంగా ఏదో ఒకటి తీసుకెళ్లాలి.
Also Read :
Jabardasth : సుధీర్ చేసిన పనికి ఫీల్ అయిన రష్మీ.. రోజా వార్నింగ్..!
బేకరీలకు ” బెంగళూరు ” “అయ్యంగార్” అని పేరు ఎందుకు పెడతారు.. దీనికి ఇంత చరిత్ర ఉందా..!!