Home » బేకరీలకు ” బెంగళూరు ” “అయ్యంగార్” అని పేరు ఎందుకు పెడతారు.. దీనికి ఇంత చరిత్ర ఉందా..!!

బేకరీలకు ” బెంగళూరు ” “అయ్యంగార్” అని పేరు ఎందుకు పెడతారు.. దీనికి ఇంత చరిత్ర ఉందా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు బేకరీలు అంటే అభివృద్ధి చెందిన పట్టణాలలో మాత్రమే కనిపించేవి. అలాంటి ఈ బేకరీలు ప్రస్తుతం చిన్న మండల కేంద్రాల నుంచి మారుమూల పల్లెల్లో కూడా వస్తున్నాయి. రకరకాల ఐటమ్స్ తో బేకరీ ఫుడ్ వైపు జనాల మనసు మల్లిస్తున్నాయి. ఆహార పదార్థాలలో అన్నీ ఒక ఎత్తు అయితే బేకరీ ఫుడ్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఎక్కువమంది చాలా ఇష్టంగా తింటుంటారు. బర్త్డే పార్టీ వచ్చిందంటే తప్పనిసరిగా బేకరీ కి వెళ్లి కేక్ తేవాల్సిందే. అలాంటి బేకరీలు మనం ఎన్నో చూస్తున్నాం. మరి ఇందులో చాలా బేకరీ లకు బెంగుళూరు బేకరీ, లేకుంటే బెంగళూరు అయ్యంగార్ బేకరీ అంటూ పేర్లుంటాయి.

Advertisement

మరి ఆ బేకరీ లకు ఆ పేర్లే ఎందుకు ఎక్కువగా పెడతారు.. దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం..!1898 లో తిరుమలచార్ అనే వ్యక్తి అతని సోదరుడితో కలిసి కర్ణాటకలో ఉన్న హస్సన్ అనే ప్రాంతం నుండి బెంగళూరు రాష్ట్రానికి వచ్చి ఒక స్వీట్ షాప్ పెట్టుకొని తన జీవనాన్ని కొనసాగించే వాడు. ఆ షాప్ కి ప్రతిరోజు ఒక ఇంగ్లీష్ వ్యక్తి వచ్చేవాడు. అతని ద్వారా ఈ స్వీట్ షాప్ వ్యక్తి బేకింగ్ గురించి తెలుసుకొని, అతని దగ్గర పూర్తిగా నేర్చుకొని బెంగళూరు బ్రదర్స్ పేరుతో బేకరీ మొట్టమొదటిసారిగా పెట్టారు.

Advertisement

దీంతో ఆ వ్యాపారం బాగా సాగుతుండటంతో చాలామంది అలాగే హస్సన్ నుంచి వచ్చి బెంగళూరులో వ్యాపారం చేయడం ప్రారంభించారు. అలా వచ్చిన వారు హస్సన్ లో ఉన్న అష్ట గ్రామాలకు చెందినవారు. వీరు అయ్యాంగార్లు అవటంతో వారి బేకరీ లకు బెంగళూరు అయ్యంగార్ బేకరీ అని నామకరణం చేసేవారు. ఇది కాలం మారుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా వారు వ్యాపారాన్ని విస్తరింపచేశారు. ఈ విధంగా ఆ పేరు బేకరీకి వచ్చింది. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది బేకరీ లు పెట్టుకొని అవే పేర్లు కంటిన్యూ చేస్తున్నారు. కానీ వీరంతా అయ్యాంగార్లు కాకున్నా బేకరీ రంగంలోకి అడుగుపెట్టి నడుపుతున్నారు.

ALSO READ:

మ్యాగీ తింటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి..!!

పిల్లల ఫుడ్ విషయంలో పెద్దలు చేసే తప్పులు ఇవే..!

 

 

Visitors Are Also Reading