ఇంట్లో మనం కచ్చితంగా, కొన్ని విషయాలని ఆచరించాలి. వంటగదిలో ముఖ్యంగా కొన్ని పొరపాట్లు చేయడం మంచిది కాదు. వంటగదిలో కొన్ని పొరపాట్లు చేయడం వలన ఇబ్బందులు తప్పవు. వాస్తు ప్రకారం వంటగదిలో కొన్ని నియమాలని కచ్చితంగా ఆచరించాలి. వంట గదిలో సానుకూల శక్తిని పెంచడానికి, కొన్ని మార్పులు చేసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే వంటగదిని ఈశాన్యం లేదంటే నైరుతి మూలలో పెట్టడం మంచిది కాదు. వాస్తు ప్రకారం వంటగది ఈ దిక్కులో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పాడవుతాయి.
Advertisement
Advertisement
వాష్ బేసిన్, గ్యాస్ సిలిండర్, ఓవెన్ మొదలైన వాటిని ఒకదానికొకటి సమాంతరంగా ఉంచకూడదు. అగ్ని, నీరు ఒకదానికొకటి వ్యతిరేక కారకాలు అని గుర్తు పెట్టుకోండి. వంటగదిలో ఆగ్నేయం వైపు గ్యాస్ స్టవ్, సిలిండర్, మైక్రోవేవ్ ఓవెన్, టోస్టర్ వంటివి పెట్టుకోవడం మంచిది. అలానే అత్త కోడల మధ్య ఇబ్బందులు రాకూడదంటే కిచెన్ లో మంచి రంగుల్ని వేయించుకోవాలి. అలానే, నైరుతి వైపు ఫ్రిడ్జ్ ని పెట్టుకుంటే జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. శాంతి లభిస్తుంది.
Also read:
- జార్వో 69కి షాకిచ్చిన ICC… వరల్డ్ కప్ మ్యాచ్లు చూడకుండా శిక్ష..!
- World Cup 2023 : రాహుల్ సెంచరీ మిస్.. పాండ్యా సెల్ఫిష్ అంటూ విమర్శలు
- రెండుసార్లు సెన్సార్ అయి కూడా చిరంజీవి పరువు తీసిన సినిమా ఏదో తెలుసా ?