Home » ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు… లక్ష జీతం

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు… లక్ష జీతం

by Bunty
Ad

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్యరోగ్య అధికారి కార్యాలయం… కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో పీడియాట్రీషియన్, జనరల్ ఫిజీషియన్, ఎంవో డెంటల్, ఆడియాలజిస్ట్ కం స్పీచ్ థెరపిస్ట్, డెంటల్ టెక్నీషియన్, డిఈఐసి మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

READ ALSO : Suryakumar Yadav : సూర్య బ్యాటింగ్ చూసి సచిన్ షాక్… వీడియో వైరల్

Advertisement

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పోస్టును బట్టి ఎంబిబిఎస్, ఎండి, బిడిఎస్, డిగ్రీ, డిప్లమా, బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ మీద తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వర్గాలకు ఐదేళ్ల సడలింపు. వికలాంగ అభ్యర్థులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

READ ALSO : సమంతను గట్టిగా హాగ్ చేసుకున్న విజయ్ దేవరకొండ…!

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో మే 16, 2023వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులను కింది అడ్రస్ కు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000 నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

READ ALSO : Iswarya Lakshmi : యువితో ఐశ్వర్య లక్ష్మి ఎఫైర్?

Visitors Are Also Reading