Home » పానీపూరిని అతిగా తింటున్నారా? అయితే…ఈ రోగాల బారిన పడాల్సిందే..!

పానీపూరిని అతిగా తింటున్నారా? అయితే…ఈ రోగాల బారిన పడాల్సిందే..!

by Bunty
Ad

పానీ పూరి తింటున్న సమయంలో ఆహా ఓహో అంటూ లొట్టలు వేసుకొని మరి తింటూ ఉంటారు. కానీ ఆ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి చాలామంది ఆలోచించరు. పానీ పూరి తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడా వాటిని తినకుండా అసలు ఉండలేరు. పానీపూరీలను వర్షాకాలం, శీతాకాలంలో అధికంగా తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

READ ALSO : మోహన్ బాబు, విష్ణు లేకుండానే మంచు మనోజ్ పెళ్లి..?

Advertisement

అంతేకాకుండా టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు కూడా వస్తాయి. పానీ పూరి లాంటి స్ట్రీట్ ఫుడ్ తింటే టైఫాయిడ్ ఎటాక్ చేస్తుంది. ఇక శీతాకాలంలో కూడా పానీపూరి వల్ల టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్లే. పిల్లల ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుందని చెబుతున్నారు. డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుందట.

Advertisement

READ ALSO : చైనాలో 40 కోట్లకు పైగా పెళ్లి కాని ప్రసాద్ లు… కారణం ఇదే!

అలాగే వీరేచనాలు, వాంతులు, కామెర్లు వచ్చే అవకాశం ఉందట. ఇంకా పానిపూరి వల్ల అల్సర్, జీర్ణ క్రియ సమస్యలు వస్తాయట. ఇంకా వీటిని తింటే ప్రేగులో మంట కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా వీటిని తినకపోవడమే మంచిది అంటున్నారు. కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. విన్నారుగా జర జాగ్రత్త. కొని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.

READ ALSO : నందమూరి కుటుంబంలో ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా…?

Visitors Are Also Reading